»   »  పక్కా లోకల్...! పక్కా లోకల్...!! మీరూ చిందేస్తారు కాజల్ కంటే బావుందీ వీడియో

పక్కా లోకల్...! పక్కా లోకల్...!! మీరూ చిందేస్తారు కాజల్ కంటే బావుందీ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జనతా గ్యారేజ్'లో కాజల్ అగర్వాల్ ఐటెంసాంగ్ లో మెరిసింది. పక్కా లోకల్ గా ఇందులో కనిపించిన సంగతి తెలిసిందే. 'పక్కాలోకల్ అంటూ చిందులేసిన కాజల్ పాట అందరినీ ఆకట్టుకుంది. అంతే కాక ఈ సాంగ్ టాలీవుడ్ యువరాణికి మంచి పేరుతో పాటు ఆఫర్లను కూడా తెచ్చిపెడుతోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా తమిళ నిర్మాలు కూడా ఐటెం సాంగ్ చేయమని కాజల్‌ని అడుగుతున్నారట. అయితే దానికి కాజల్ సై అనడం లేదట. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఇక ఐటెం సాంగ్ చేసేది లేదని ఈ అమ్మడు చెప్పినట్లు తన సన్నిహితులు వెల్లడించారట.

Janatha Garage

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం వల్లే జనతా గ్యారేజ్‌లో స్పెషల్ సాంగ్‌కి ఒప్పుకున్నట్లు ఆమె సన్నిహితులు తెలుపుతున్నారు. ఇక నుంచి కాజల్ ఐటం సాంగ్స్ చేయదని వారు డైరెక్ట్ గానే చెప్పేశారట. ఈ ఒక్క సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ యాభై లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందట. మిగతా విషయాల్లో ఏమో కానీ రెమ్యూనరేషన్ దగ్గర మాత్రం కాజల్ అస్సలు తగ్గదు. అందుకే అరకోటి తీసుకుని ఐటెం సాంగ్‌కి సై అనేసిందట.


ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అన్నది పక్కన పెడితే... ప్రస్తుతం వెబ్ మరియు సోషల్ మీడియాలో ఈ పాటకు చిప్ మంక్ వర్షన్ లో ఎడిటింగ్ చేసిన పాట ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది. ఇదివరలో కూడా కొన్ని పాటలని ఈ యాని మేషన్ బొమ్మలతో రీమిక్స్ చేసారు కానీ బాలీవుడ్ పాటలే ఎక్కువగా కనిపించేవి కానీ ఇప్పుడు పక్కా లోకల్ పాప కాజల్ కూడా ముచ్చట పడి చూసేలా సూపర్ స్టెప్పులతో చేసిన ఈ వీడియో నెట్ లో ఒక దుమారం లా తయారయ్యింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షన్నర మంది షేర్లు చేసారు. జనతా గ్యారేజ్ విజయాన్ని ఆస్వాధించిన ఎన్టీఆర్ అభిమానులకు ఇది మరో కానుక అని చెప్ప వచ్చు. ఇంత పాపులర్ అయిన ఈ డాన్స్ వైపు మీరు ఓ లుక్కేయండి.


English summary
Kajal's latest song 'Pakka Local' from Janatha Garage is on of the most viewed song in recent times. now here is "Chipmunk" version of Pakka Local is one of the awesome mashup in recent times..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu