»   » జనతా ఇక ఆగిపోయినట్టేనా..? ఇంకా ఆరో స్థానం లోనే జూనియర్

జనతా ఇక ఆగిపోయినట్టేనా..? ఇంకా ఆరో స్థానం లోనే జూనియర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోయిన సంవత్సరం వచ్చిన "బాహుబలి' ఓవర్సీస్ లో ఏకంగా 30కోట్లు వసూల్ చేసింది. ఇంత రేంజ్ లో కాకపోయిన 'జనతా గ్యారేజ్'తో 20కోట్లు అయిన కొల్లగొట్టాలని 'ఎన్టీఆర్', 'కొరటాల' భావించారు. 'కొరటాల శివ' గత చిత్రం 'శ్రీమంతుడు' ఓవర్సీలో 15కోట్ల వరకు చేరుకుంది. ఈ సక్సెస్ వల్ల వచ్చిన కొరటాల ఇమేజ్ 'జనతా గ్యారేజ్' కి కలిసొస్తుందని నమ్మకంగా ఉన్నారు.

అంతేకాదు సినిమా కాన్సెప్ట్ కూడా యూనివర్శల్ కావడంతో సక్సెస్ పై కాన్పిడెంట్ ఉన్నారు అయితే ఈ పరిస్థితంగా నిన్నా మొన్నటివరకే ఇక ఇప్పుడు ఆ ఆశలని వదిలేసుకోవాల్సిందే. జనతా గ్యారేజ్ కలెక్షన్లు అనూహ్యంగా భారీ స్థాయిలో పడిపోయాయట. దీంతో ఓవర్సీస్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలనుకున్న యంగ్ టైగర్ ఆశలు ఆవిరైపోయే ప్రమాదం ఉందంటున్నారు. రీసెంట్ గా వచ్చిన విక్రమ్ 'ఇంకొకడు' డిజాస్టర్ గా నిలవడం గ్యారేజ్ కలిసొస్తుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. మరోవైపు నిన్న విడుదలైన జ్యో అచ్యుతానందకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఇది కూడా పూర్తిగా మల్టీ ప్లెక్స్ సినిమాగా పేరు తెచ్చుకోవడంతో.. గ్యారేజ్ కు తిరుగుండదు అనుకున్నారు. కానీ కలెక్షన్లు మాత్రం అలాగే ఉన్నాయి.


 Janatha Garage sits in 6th Place in Overseas

అక్కడ ఈ సినిమా ఫైనల్‌ ఫిగర్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తొలి వీకెండ్లోనే 1.5 మిలియన్ మార్కును టచ్ చేసిన ఈ సినిమా ఈజీగా 2 మిలియన్ మార్కును దాటేస్తుందని అనుకున్నారు. కానీ అతి కష్టం మీద 1.8 మిలియన్ మార్కును అందుకుంది. అక్కడితో ఆగిపోయింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో 'జనతా గ్యారేజ్' స్థానం ఆరుకు పరిమితమైంది. ఓవర్సీస్లో ఇప్పటివరకూ అత్యథిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలివే..
1. బాహుబలి (7 మిలియన్లు),
2.శ్రీమంతుడు (2.89 మిలియన్లు),
3.అఆ (2.44 మిలియన్లు),
4.నాన్నకు ప్రేమతో (2 మిలియన్లు),
5.అత్తారింటికి దారేది (1.89 మిలియన్లు) తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
'జనతా గ్యారేజ్' ఆరులో ఉంది. ఆ తర్వాత వరుసగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (1.63 మిలియన్లు), ఊపిరి (1.57 మిలియన్లు), దూకుడు (1.56 మిలియన్లు), మనం (1.53 మిలియన్లు) ఉన్నాయి....

English summary
Janatha Garage collections in US have drastically dropped after its first weekend. 2 Million gross looked possible but the film has seen a huge drop after its first Monday and never picked up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu