Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రైలర్లోనే కథ చెప్పేసారు: ‘జనతా గ్యారేజ్’ దుమ్ము రేపడం ఖాయం (వీడియో)
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జనతా గ్యారేజ్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈచిత్రం ఆడియో రిలీజ్ వేడుక శుక్రవారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబులో దుమ్ము రేపుతోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా కాన్సెప్టు ఎంత అద్భుతంగా ఉందో అర్థం అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ ఆనంద్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ భూమితో పాటు ఈ భూమి మీద ఉన్న సృష్టి అన్నా ఆనంద్ కి ఎంతో ఇష్టం. చెట్లు, మొక్కులు, గాలి, నీరు వాటిని కాపాడు కోవడమే అని పని కూడా. అతని చెట్లంటే ఎంత ప్రాణమో... బుజ్జి(సమంత) అంటే కూడా అంతే ఇష్టం.
ఎక్కడో ఇంకో చోట ఉండే పెద్ద మనిషి(మోహన్ లాల్) కి ఈ భూమి మీద ఉండే మనుషులంటే ఎంతో ఇష్టం. ఎదుటోడి కష్టం విని, కళ్లలో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగక పోవడం.. లాంటి క్యారెక్టర్ అతడిది. సృష్టికి ఇద్దరినీ కలిపితే బావుండనిపించిందో ఏమో... మెక్కలతో పాటు ఈ భూమి మీద ఉన్న మనుషులను కూడా కాపాడితే ఈ భూమి ఇంకా అందంగా ఉంటుందని ఎన్టీఆర్ తో చెబుతాడు మోహన్ లాల్. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందంటూ పిలుస్తాడు.

అతనితో చేతులు కలిపిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ద్వారా బలహీనులకు అండగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారిని కాపాడుతుంటారు. ఈక్రమంలో ఎలాంటి సంఘటనలు చోటే చేసుకున్నాయనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారని తెలుస్తోంది.