»   » ‘జనతా గ్యారేజ్’ టికెట్స్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలం వెర్రి...!

‘జనతా గ్యారేజ్’ టికెట్స్: ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలం వెర్రి...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూ ఎన్టీఆర్ ఒకరు. ఆయన సినిమా రిలీజవుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు తొలి షో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంటారు.

ముఖ్యంగా సినిమా రిలీజ్ కంటే ముందే వేసే బెనిఫిట్ షోల టికెట్లు దక్కించుకోవడానికి అభిమానులు వేల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడరు. మరో రెండు రోజుల్లో 'జనతా గ్యారేజ్' మూవీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల హడావుడి మొదలైంది.


సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. షూటింగ్ పూర్తయి ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.


బెనిపిట్ షో, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దక్కించుకోవడానికి ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల టికెట్స్ పరిమిత సంఖ్యలో ఉండటం, అభిమానులు అపరిమితంగా ఉండటంతో వాటిని దక్కించుకునే క్రమంలో అభిమానులు పోటీ పడి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. చెన్నైలో టికెట్లను వేలం వేయగా భారీ ధర పలికాయి.


చెన్నైలో టికెట్స్ వేలం

చెన్నైలో టికెట్స్ వేలం


చెన్నైలోని ఎస్.ఆర్.ఎం. యూనివర్శిటీలో జనతా గ్యారేజ్ టిక్కెట్లు వేలం వేశారు. తెలుగుదేశం పార్టీ చెన్నై యువసేన విభాగం ఈ టిక్కెట్ల వేలాన్ని నిర్వహించింది.


తొలి టికెట్

తొలి టికెట్


తొలి టికెట్ ఓ అభిమాని రూ. 31000లకు దక్కించుకున్నట్లు సమాచారం.


రెండో టికెట్

రెండో టికెట్


రెండో టికెట్ ధర రూ. 17500 వరకు పలికినట్లు తెలుస్తోంది.


మూడో టికెట్

మూడో టికెట్


మూడో టికెట్ వేలంలో రూ. 13000లకు అమ్ముడయినట్లు సమాచారం.


బెనిఫిట్ షోలో

బెనిఫిట్ షోలో


ఆగస్టు 31వ తేదీ రాత్రి నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో బెనిఫిట్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


చుక్కల్లో ధరలు

చుక్కల్లో ధరలు


బెనిఫిట్ షో టికెట్ ధరలు చుక్కల్లో ఉన్నాయి. ఆయా ఏరియాల్లో డిమాండును బట్టి రూ. 3 వేల నుండి 5 వేల వరకు అమ్ముతున్నారు.


పేద అభిమానులు

పేద అభిమానులు


కొందరు పేద అభిమానులు బెనిఫిట్ షో టికెట్లు రేట్లు చూసి షాకవుతున్నారు. అంత ఖర్చు పెట్టే స్తోమత లేక నిరాశకు గురవుతున్నట్లు సమాచారం.


అక్రమార్కులు

అక్రమార్కులు


అభిమానుల వీక్‌నెస్ క్యాష్ చేసుకోవడానికి కొందరు అక్రమార్కులు కూడా సిద్ధమయ్యారు. భారీ గా బ్లాక్ టికెటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంతో కొందరు థియేటర్ యజమానులే బ్లాక్ టికెట్స్ అమ్మిన సందర్భాలు అనేకం.


జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్


జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్


మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ ల లో విడుదల కు సిద్ధం అవుతోంది.


English summary
Jr. NTR has undoubtedly super craze among college students , His upcoming film Janatha Garage tickets were reportedly auctioned by SRM University students . TDP Yuvasena has auctioned the special; benefit show tickets at Chennai SRM University. Students reponse for the auction was mind blowing, They competed among themselves to buy the 1st ticket and Finally the first three tickets were sold for whopping price.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu