»   »  పవన్‌ రికార్డ్ పడగొడతాడా? జనతా గ్యారేజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?

పవన్‌ రికార్డ్ పడగొడతాడా? జనతా గ్యారేజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' చిత్రానికి విడుదల ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే యఎస్ఏ ప్రీమియర్ షోలో ద్వారా కలెక్షన్స్ బాగా వచ్చాయి. 'నాన్నకు ప్రేమతో', 'అ..ఆ' చిత్రాల రికార్డులను ఈచిత్రం వద్దలు కొట్టటింది.

ఎన్టీఆర్- మోహన్ లాల్ కాంబినేషన్... మిర్చి, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్వకుడు కొరటాల, సమంత, నిత్యామీనన్, ఉన్నిముకుందన్ లాంటి భారీ తారాగణం కావడంతో సినిమాకు ప్రీ రిలీజ్ హైప్ భారీగా వచ్చింది. దీనికితో సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా సూపర్బ్ గా నిర్వహించారు.


FICUS ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్నేషనల్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం రూ. 7.25 కోట్లు వెచ్చించారు. ఎన్టీఆర్ కెరీర్లోనే ఓవర్సీస్ లో ఇంత హైప్ రావడం ఇదే తొలిసారి.


సినిమా హైప్ కు తగిన విధంగానే ఫికస్ ఎంటర్టెన్మెంట్స్ వారు సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసారు. యూఎస్ఏ, ఇతర కంట్రీలన్నింటిలో కలిపి 200 స్క్రీన్లలో రిలీజ్ చేసారు. సినిమా రిలీజ్ ముందు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగింది.


బుధవారం రాత్రి అమెరికాలోప్రదర్శించిన ప్రీమియర్ షోలు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్ షోలో వేసిన అన్ని సెంటర్లూ దాదాపు హౌస్ ఫుల్ అయ్యాయి. మొత్తం 140 సెంటర్లలో ప్రీమియర్ షోలోలు వేయగా...కొన్ని సెంటర్ల నుండి అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు $479,000 వసూలు చేసినట్లు సమాచారం. అయితే కొన్ని లొకేషన్ల నుండి ఇంకా వివరాలు రాలేదు. అవి కూడా కలిపితే $550000 వరకు రావొచ్చని అంచనా. అయితే ప్రీమియర్ లకు సంబంధించి పూర్తి కలెక్షన్ వివరాలు రాలేదు కాబట్టి ఇప్పడే ఓ అంచనాకు రాలేక పోతున్నారు.


పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్‌కల్యాణ్‌ రీసెంట్‌ సినిమా ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. సినిమా పరాజయం పాలైనా దాదాపు 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంతేకాకుండా యూఎస్‌ ప్రీమియర్‌ షోల ద్వారా ఎక్కువ కలెక్షన్లు సృష్టించిన రెండో తెలుగు సినిమాగా కూడా ఘనతను సొంతం చేసుకుంది.


జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్


ఇప్పుడు ఈ రికార్డును ‘జనతా గ్యారేజ్‌' దాటుతుందా? లేదా? అని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.


యూఎస్ఏలో

యూఎస్ఏలో


యూఎస్‌లో అత్యధిక ప్రీమియర్‌ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో బాహుబలి మొదటి స్థానంలో ఉంది. 1.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు 10 కోట్ల రూపాయలు)తో ఈ జాబితాలో అగ్రస్థానం సాధించింది.


తర్వాతి స్థానంలో

తర్వాతి స్థానంలో


6.15 లక్షల డాలర్ల (4.11 కోట్ల రూపాయలు)తో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' రెండోస్థానంలోనూ, 5.60 లక్షల డాలర్ల (3.7 కోట్ల రూపాయలు)తో ‘బ్రహ్మోత్సవం' మూడోస్థానంలోనూ ఉన్నాయి.


ఆల్రెడీ నాన్నకు ప్రేమతో, అ..ఆ, సరైనోడు రికార్డులు బద్దలు

ఆల్రెడీ నాన్నకు ప్రేమతో, అ..ఆ, సరైనోడు రికార్డులు బద్దలు


ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నాన్నకు ప్రేమతో ($355,321), అ...ఆ ($251,548), సరైనోడు($197,454) రికార్డులను ‘జనతా గ్యారేజ్' చిత్రం బద్దలు కొట్టింది.
English summary
As per early estimates, "Janatha Garage" has collected approximately $479,000 from 140 centres at the U.S.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu