»   » నాని 'జెండాపై కపిరాజు' ఎంతవరకూ వచ్చింది?

నాని 'జెండాపై కపిరాజు' ఎంతవరకూ వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. అమలాపాల్‌ హీరోయిన్. శరత్‌కుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు. ప్రస్తుతం తమిళనాడు కోయింబత్తూర్ లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది.

నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

ఇందులో తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.


దర్శకుడు మాట్లాడుతూ ''మార్పు అనేది ఇంటి నుంచి మొదలవ్వాలి అంటారు. అంతకంటే ముందు ఎవరికివాళ్లు తమ ఆలోచనాధోరణిలోనూ... మనస్తత్వంలోనూ మార్పు చూపించాలి. కథ, కథనాలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. వినోదానికి ప్రాధాన్యముంది. నాని రెండు పాత్రల్లో చక్కటి అభినయం ప్రదర్శించారు''అన్నారు.

శివబాలాజీ, ఆహుతి ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

English summary
Nani’s latest flick ‘Janda Pai Kapiraju’ is in final stages of shooting. Shooting of the film is going on in Coimbatore to shoot the climax sequence. Nani is playing dual roles in this action drama. Amala Paul is the lead actress. The film is inspired from a real incident and it’s based on the theme that if you change yourself, the society will change automatically. Samuthirakani is directing the film and K S Srinivasan is producing the film under Vasan Visual Ventures banner. GV Prakash is scoring the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu