For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు

  |

  సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మందిని వారసులుగా పరిచయం చేస్తుంటారు. అందులో ఎక్కువగా అబ్బాయిలే ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలను సినీ పరిశ్రమలోకి తీసుకు రావడానికి పెద్దగా సాహసం చేయరు. కానీ, అందుకు భిన్నంగా తన కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేశారు దిగ్గజ నటి శ్రీదేవి. అందాల తార కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో సత్తా చాటి మంచి పేరును తెచ్చుకుందామె. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి సీక్రెట్ రివీల్ చేసింది జాన్వీ కపూర్. ఆ సంగతులు మీకోసం!

  వ్యవహారంతో హైలైట్... మొదటి సినిమాతోనే

  వ్యవహారంతో హైలైట్... మొదటి సినిమాతోనే

  తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది జాన్వీ కపూర్. తరచూ వింత వింత డ్రెస్‌లు వేసుకుంటూ వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ.. చిన్న వయసులోనే పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ‘ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇక, తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది.

   ప్రేమ వ్యవహారాలతో ఫేమస్.. విమర్శలపాలు

  ప్రేమ వ్యవహారాలతో ఫేమస్.. విమర్శలపాలు

  సినిమాల్లోకి రాకముందే అక్షత్ రంజన్, శిఖర్ పహారియా అనే కుర్రాళ్లతో ప్రేమాయణం సాగించింది జాన్వీ కపూర్. అంతేకాదు, వాళ్లిద్దరితో ప్రేమలో ఉన్న సమయంలో లిప్‌లాక్, రొమాన్స్ చేస్తూ దిగిన ఫొటోలు కూడా అప్పట్లో సంచలనం అయ్యాయి. ఇక, సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ అమ్మడు.. అతడికి దూరమైంది. అదే సమయంలో ఓ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

   మహిళా పైలెట్‌గా మారిన శ్రీదేవి కూతురు

  మహిళా పైలెట్‌గా మారిన శ్రీదేవి కూతురు

  కార్గిల్‌ వార్‌లో యుద్ధ విమానాలు నడిపిన మహిళా పైలట్‌ గుంజాన్‌ సక్సేనా జీవిత చరిత్రా ఆధారంగా రూపొందిన చిత్రం ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌'. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నెటిజన్ల నుంచి మంచి స్పందననే అందుకుని సత్తా చాటింది.

  ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు ఇవే

  ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు ఇవే

  జాన్వీ కపూర్ ‘రూహీ' అనే సినిమాలో నటించింది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మించారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. దీనితో పాటు జాన్వీ ‘దోస్తానా 2'లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.

   తిరుమలలో ప్రత్యక్షం అయిన జాన్వీ కపూర్

  తిరుమలలో ప్రత్యక్షం అయిన జాన్వీ కపూర్


  వరుస సినిమాలతో సత్తా చాటుతోంది జాన్వీ కపూర్. నటించిన ప్రతి దానిలోనూ పరిణితిని కనబరుస్తూ ప్రశంసలు అందుకుంటోంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తరచూ తిరుమల వస్తుంటుందామె. శ్రీదేవికి ఈ పుణ్య క్షేత్రం అంటే ఎంత ఇష్టమో.. జాన్వీకి కూడా అంతే మక్కువ. అందుకే వీలు చిక్కినప్పుడల్లా సందర్శిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వచ్చిందామె.

   తిరుపతిలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి

  తిరుపతిలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ పెళ్లి

  తాజాగా తిరుమలకు వచ్చిన జాన్వీ కపూర్.. లోకల్ మీడియాతో మనసు విప్పి మాట్లాడింది. ఇందులో భాగంగానే తన పెళ్లి గురించి వివరిస్తూ.. ‘పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఘట్టం. దాన్ని నేను అదే రీతిలో జరుపుకుంటాను. మరీ ముఖ్యంగా నేను తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టమైనది. అందుకే తరచూ వస్తుంటాను' అని చెప్పుకొచ్చింది.

  లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్

  లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్

  దీనిన కొనసాగిస్తూ.. ‘తిరుపతిలో జరిగే నా పెళ్లి సంప్రదాయ పద్దతుల్లోనే ప్లాన్ చేస్తాను. ఇందుకోసం నేను కాంచీపురం పట్టు చీరను కట్టుకుంటాను. అలాగే, నాకు కాబోయే వాడు లుంగీ పంచెతో వస్తాడు. అలాగే, మేము మా వివాహ విందును అరటి ఆకులో తింటాము' అంటూ తన మనసులోని కోరికలను రివీల్ చేసింది జాన్వీ. దీంతో ఈ అమ్మడు దక్షిణాదిపై ఉన్న ఇష్టాన్ని బయట పెట్టింది.

  English summary
  Janhvi Kapoor was born on 6 March 1997 to the actress Sridevi and the film producer Boney Kapoor. She has one younger sister, Khushi, and two half siblings, actor Arjun Kapoor and Anshula Kapoor. She is the niece of actors Anil Kapoor and Sanjay Kapoo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X