»   »  జపాన్‌ నుంచి వచ్చి మరీ ఎన్టీఆర్ ని కలిసి...

జపాన్‌ నుంచి వచ్చి మరీ ఎన్టీఆర్ ని కలిసి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ మరే తెలుగు హీరోకు లేని విధంగా జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకనే ఆయన ఆయన నటించే ప్రతీ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. అక్కడ వాళ్లు ఎన్టీఆర్ డాన్స్ లు విపరీతంగా నచ్చేసి,ఆయన డాన్స్ చేసిన పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ వీడియోలు సైతం విడుదల చేస్తున్నారు.

 Japanese fan meets NTR on sets

అంతెందుకు ఆయన 'బాద్‌షా' చిత్రాన్ని జపాన్‌ జనం తెగ చూసి బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా రిలీజ్ అయినప్పట్నుంచి ఎన్టీఆర్‌పై జపనీయుల అభిమానం మరింత పెరిగింది. ఆ అభిమానం ఎక్కడిదాకా వెళ్లిదంటే... ఆయన సినిమాలు మరింత బాగా అర్దం చేసుకోవటం కోసం తెలుగు నేర్చుకొనేంతగా.

ఇక ఇటీవల ఎన్టీఆర్‌ని కలిసేందుకని జపాన్‌ నుంచి నాన్‌ అనే ఓ మహిళాభిమాని హైదరాబాద్‌కి వచ్చారు. సోమవారం ఆమె 'జనతా గ్యారేజ్‌' సెట్‌కి వెళ్లి ఎన్టీఆర్‌తో చాలాసేపు ముచ్చటించారు. ఆటోగ్రాఫ్‌ కూడా తీసుకొన్నారు.

 Japanese fan meets NTR on sets

తెలుగంటే నాకు ఇష్టం అని టీ షర్టుపై రాసుకొన్న నాన్‌ ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా', 'బృందావనం', 'స్టూడెంట్‌ నెం:1' చిత్రాల్లోని సంభాషణల్ని పలికి చిత్రయూనిట్ ని ఆశ్చర్యానికి గురిచేసింది.

English summary
Naan is from Tokyo and is a die hard fan of NTR. She flew from Tokyo to Hyderabad to meet NTR on 23rd of April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu