»   »  'కుమారి 21ఎఫ్' స్పూఫ్ (వీడియో)

'కుమారి 21ఎఫ్' స్పూఫ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్టైన సినిమాల స్ఫూఫ్ ల సీజన్ నడుస్తున్నట్లుంది. దాదాపు ప్రతీ కొత్త సినిమాలనూ కమిడయన్స్ తో ఈ స్ఫూఫ్ లు లాగించేసి, ట్రైలర్స్ కట్ చేసి జనాల్లోకి వదిలి, ఆకట్టుకునే ప్రయత్నం చేసున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలవాళ్లు ఈ స్ఫూఫ్ లపై ఎక్కువ ఆధారపడుతున్నారు. తాజాగా వారాహి వాళ్లు రిలీజ్ చేస్తున్న 'జతకలిసే' చిత్రంలోనూ ఈ స్ఫూఫ్ లు చోటు చేసుకోనున్నాయి.

 Jatakalise comedy videios : Vaaraahi

అశ్విన్‌, తేజస్వి కలిసి నటించిన సినిమా 'జతకలిసే'. ఈ సినిమాలోని కోన్ని స్పూఫ్ కామెడీ టీజర్లు వారహీ వారు తమ ఫేస్ బుక్ ఖాతా ద్వారా విడుదల చేసారు. రాకేశ్‌ శశి డైరక్షన్ చేసిన ఈ సినిమాని నరేష్‌ రావూరి నిర్మించారు. ఈ నెల 25న జతకలిసే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో మెదటి ట్రైలర్ ..శ్రీమంతుడు గా సప్తగిరి, గబ్బర్ సింగ్ పోలీస్ డ్రస్ లో షకలక శంకర్ కనిపిస్తారు. దీనికి సంబందించిన వీడియోఇక్కడ చూడండీ.

అలాగే కుమారి 21ఎఫ్ ని స్పూఫ్ చేసిన వీడియె ఇక్కడ చూడండి

చిత్రం విశేషాలకు వస్తే...జర్నీ నేపధ్యం లో సాగే లవ్ స్టోరి. ఈ సినిమాని వైజాగ్, అన్నవరం, రాజమండ్రి, రామచంద్రాపురం, రంపచోడవరం అటవీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల లో చిత్రీకరించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాను చూసిన వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి , మూవీని అవుట్ రేట్ చెల్లించి సినిమాను గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఆయన సినిమాను విడుదల చేస్తుండటంతో సినిమా రేంజ్ పెరిగింది.

పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, రాజుగారి గది ఫేమ్ విద్యుల్లేఖ రామన్(బుజ్జమ్మ),‘జబర్ దస్త్' రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మరి కొంత మంది నూతన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రానికి సాహిత్యం: అనంత్ శ్రీరామ్, రెహమాన్, డ్యాన్స్: శేఖర్, గణేష్, విజయ్, ఫైట్స్: జాషువ, ఆర్ట్: జె.కె.మూర్తి, పిఆర్ఓ: వంశి- శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: జగదీష్ చీకటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైది, సంగీతం: విక్కి, సాయికార్తీక్, నిర్మాత: నరేష్ రావూరి, రచన-దర్శకత్వం: రాకేష్ శశి.

English summary
Jatha Kalise Comedy Trailer is out - Vidyullekha Raman "Kumari 21F" Spoof.srimanthudu, jathakalise, kumari 21f, tollywood, శ్రీమంతుడు, జతకలిసే, కుమారి 21 ఎఫ్, టాలీవుడ్
Please Wait while comments are loading...