»   » ఆశ్చర్యం.... జయా బచ్చన్, రేఖ కౌగిలింత!

ఆశ్చర్యం.... జయా బచ్చన్, రేఖ కౌగిలింత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వెండితెర రొమాన్స్ హిట్ ఫెయిర్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిన అమితాబ్ బచ్చన్, రేఖ అప్పట్లో బాలీవుడ్లో ఓ సంచలనం. 70వ దశకంలో అమితాబ్, రేఖ జంటగా నటించిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. ఆ తర్వాత ఇద్దరిమధ్య ప్రేమాయణం కూడా నడిచింది. అప్పట్లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

బాలీవుడ్లో రేఖ, అమితాబ్, జయ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కానీ అమితాబ్ చివరకు జయను పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమితాబ్ బచ్చన్ రేఖతో కలిసి సినిమాలు చేయలేదు. అమితాబ్ తనకు దక్కక పోవడంతో రేఖ అసలు పెళ్లే చేసుకోలేదు.మరో వైపు అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు రేఖకు ఏ మాత్రం పొసగదన్న వార్తలు ఉన్నాయి.

Jaya Bachchan and Rekha hug

బాలీవుడ్‌లో వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఇప్పటికీ పలువురికి ఆసక్తే. ఎప్పుడైనా ఏదైనా సినిమా ఫంక్షన్లో అమితాబ్, రేఖ ఎదురు పడినా.....పలకరించుకున్న సందర్భాలు కూడా తక్కువే. తన వెంట భార్య జయా బచ్చన్ ఉంటే......రేఖ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేసే వారు కాదు అమితాబ్.

అప్పట్లో... రాజ్య సభలో జయా బచ్చన్, రేఖ మధ్య సీటు నెంబర్ కేటాయింపు విషయంలో పెద్ద వివాదమే నడిచింది. కానీ ఈ ఇద్దరు ఇటీవల ఓ ఫంక్షన్లో కౌంగిలించుకోవడం చర్చనయాంశం అయింది. ముంబైలో జరిగిన స్క్రీన్ అవార్డ్స్2016 సందర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

English summary
Rekha's equation with the Bachchan family has always been mired in controversies. Not very often do Jaya Bachchan and Rekha cross paths but last evening was an exception where the two yesteryear beauties hugged it out at an award ceremony.
Please Wait while comments are loading...