»   » బోయపాటి స్టైల్: ‘జయ జానకి నాయక’ పబ్లిక్ టాక్

బోయపాటి స్టైల్: ‘జయ జానకి నాయక’ పబ్లిక్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మాస్ సినిమాలు తీయడంలో బోయపాటికి మంచి పట్టుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన భద్ర, సింహ, లెజెండ్, సరైనోడు సినిమాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

తాజాగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది.


లవ్ స్టోరీ, యాక్షన్ జోడించి

లవ్ స్టోరీ, యాక్షన్ జోడించి

లవ్ స్టోరీ, యాక్షన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెన్సబుల్ యూత్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. అతడి గురించి, అతడి మంచి మనసు, ఫ్యామిలీని చూసి ఇంప్రెస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ అతడిపై మనసు పారేసుకుంటుంది. అతడికి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే ఆమె తండ్రి ఈ ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.


కొత్త సీసాలో పాత సారా

కొత్త సీసాలో పాత సారా

సినిమా చూసిన చాలా మంది సినిమా కథ కొత్త సీసాలో పాత సారాలా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా ఫస్టాఫ్ లో కొన్ని సాంగ్స్, యాక్షన్ సీన్లు ఫర్వాలేదనే విధంగా ఉన్నాయట. సెకండాఫ్‌ హై ఎమోషనల్ కంటెంటుతో ఉందని, చాలా చోట్ల సినిమా సాగదీసినట్లు ఉందని టాక్.


హీరో మైనస్

హీరో మైనస్

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ సీన్లు బాగానే చేసినా... కొన్ని సీన్లలో ఎక్స్‌ప్రెషన్స్ సరిగా లేవని, నటన పరంగా అతడు ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నారట.


టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే... జయ జానకి నాయక చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రిషి పంజాబి కెమెరా వర్క్ సినిమాకు హైలెట్ అయ్యాయి. కొరియోగ్రఫీ, యాక్షన్ సీన్లు, డాన్స్, డైలాగులు బోయపాటి స్టైల్ లో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.


ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

భారీ తారాగణం
ప్రొడక్షన్ వ్యాల్యూస్
రకుల్ ప్రీత్ సింగ్
బెల్లకొండ సాయి శ్రీనివాస్ డాన్సులు, ఫైట్లు


మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన.
ఆకట్టుకోలేని స్టోరీ


ఇదీ ఆడియన్స్ అభిప్రాయం

ఇదీ ఆడియన్స్ అభిప్రాయం

‘జయ జానకి నాయక' బోయపాటి స్టైల్ మాస్ మూవీ. సరైనోడు తరహాలో సాగే సినిమా. అయితే ఇందులో అన్నీ బలాలు బాగానే ఉన్నాయి కానీ.... హీరో బలం లేదు. దాన్ని కవర్ చేయడానికి బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టి ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేశారని చర్చించుకుంటున్నారు. క్లాస్ సినిమాలు ఇష్టపడే ‘ఎ' సెంటర్ ప్రేక్షకులు పెద్దగా నచ్చక పోవచ్చని, ఇది ‘బి', ‘సి' సెంటర్స్‌లో వర్కౌట్ కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


English summary
Director Boyapati Srinu's Telugu movie Jaya Janaki Nayaka starring Bellamkonda Sreenivas, Rakul Preet Singh and Pragya Jaiswal, has received mixed review and average rating from the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu