»   »  రోడ్డుమీద హీరో, బైక్ మీద హీరోయిన్: 'జయ జానకి నాయక' ఫస్ట్ లుక్

రోడ్డుమీద హీరో, బైక్ మీద హీరోయిన్: 'జయ జానకి నాయక' ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బోయపాటి గత సినిమాలన్నీ మాస్‌ టైటిల్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తొలిసారి 'జయ జానకి నాయక' అంటూ క్లాస్‌ టైటిల్‌ను పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కథానాయకుడి పాత్రను ధీరోదాత్తంగా చూపించడంలో బోయపాటిది ప్రత్యేకశైలి. ఇక 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లకొండ శ్రీనివాస్‌తో బోయపాటి చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

 Jaya Janaki Nayaka First Look Released

శ్రీను ఇప్పుడు కొంచెం క్లాస్ టచ్ తో తెలుస్తోంది. తాజా బెల్లకొండ సురేష్ తనయుడు బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమా చేస్తున్నాడు. తన సినిమాలకి పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టే బోయపాటి, ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే టైటిల్ పెట్టడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయికగా కేథరిన్ నటించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నఈ చిత్రం టాకీ ఇటీవలే పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ బాకీ వుంది.


ఇటీవల టైటిల్ లోగో విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. బెల్లంకొండ శ్రీను రోడ్డుపై కూర్చొని ఉండగా, రకుల్ బైక్ పై కూర్చొని ఫోటోలకి ఫోజులిచ్చింది. జులై 7న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుండగా సినిమాలో శ్రీనివాస్ తో సహా మొత్తం ఆరుగురు హీరోలు, మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట.


 Jaya Janaki Nayaka First Look Released

ఒకప్పటి హీరోలు జగపతిబాబు, శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. వారే కాక 'సై' ఫేమ్ శశాంక్ కూడా నటిస్తున్నారు. ఇక హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కాక మరొక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ చేస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం క్యాథరిన్ థ్రెసా, మరికొన్ని ముఖ్యపాత్రలు కోసం అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్, సితార, 'భీమవరం బుల్లోడు' ఫేమ్ ఎస్తర్ నొరోన్హా నటించారని టాక్.


English summary
"Jaya Janaki Nayaka" title announced few days back grabbed all the eye balls and now the first look comprising of Bellamkonda Sreenivas transformation into a stylish avatar, simple Rakul Preet Singh's enticing beauty in a well designed poster
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu