»   » ఎన్నికోట్లు తెస్తే జానకీ నాయకుడు జయిస్తాడో తెలుసా..?

ఎన్నికోట్లు తెస్తే జానకీ నాయకుడు జయిస్తాడో తెలుసా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మొదట్లో కాస్త అటూ ఇటూ అనిపించినా పోనూ పోనూ మంచి పాజిటివ్‌బజ్ నే రాబట్టుకుంది.

రొటీన్ అభిప్రాయాన్ని తుడిచి పెట్టేసాడు

రొటీన్ అభిప్రాయాన్ని తుడిచి పెట్టేసాడు

బోయపాటి సినిమాలంటే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయన్న రొటీన్ అభిప్రాయాన్ని తుడిచి పెట్టేసాడు. టీజర్‌లో ఎక్కడా మాస్ ఛాయలు మచ్చుకైనా కనిపించకుండా తనలో మరో యాంగిల్‌ను బయటపెట్టాడు బోయపాటి. మాస్ ఫ్లేవర్‌తో నింపేస్తాడనుకున్న'జయజానకినాయక' టీజర్ టైటిల్‌కి తగ్గట్టే పూర్తి క్లాస్‌ టచ్‌లో సినిమా ఉండబోతుందన్న ఫీలింగ్‌ని కలగజేసాడు.

Boyapati Srinu Powerful Speech @Jaya Janaki Nayaka Movie Logo Launch | Filmibeat Telugu
'ఫిదా' కంటే ఎక్కువ వసూలు చేయాలి

'ఫిదా' కంటే ఎక్కువ వసూలు చేయాలి

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఎలాంటి పుల్‌ లేకపోయినా కానీ బోయపాటి శ్రీను మీద నమ్మకంతో బయ్యర్లు ఇంత పెట్టుబడి పెట్టారు. సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఈ సినిమా హిట్‌ అనిపించుకోవాలంటే 'ఫిదా' కంటే ఎక్కువ వసూలు చేయాలి.

అంత ఈజీ కాదు

అంత ఈజీ కాదు

పోటీ లేని వాతావరణంలో అయితే ఈ టార్గెట్‌ కష్టం కాదేమో కానీ మూడు సినిమాలు రెవెన్యూ పంచుకుంటాయి కనుక దీనిని రికవర్‌ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు పోటీగా ఉన్నవి రెండూ కూడా మామూలు సినిమాలేం కాదు. ఢీ అంటే ఢీ అన్నట్టుగానే ఉంది పరిస్థితి.

నమ్మకంతో వున్నాడు

నమ్మకంతో వున్నాడు

బోయపాటి శ్రీను మాత్రం తన సినిమాపై అపారమైన నమ్మకంతో వున్నాడు. తను తీసిన మిగిలిన సినిమాలకి హీరోలు ప్లస్‌ అయితే, దీనికి సబ్జెక్ట్‌ ప్లస్‌ అవుతుందని, పోటీ వున్నా కానీ ఈ చిత్రానికి వున్న కథాబలం వల్ల విజయం తథ్యమని అంటున్నాడు. ఇది కానీ హిట్టయితే బోయపాటి పరపతి అమాంతం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు.

ముప్పయ్‌ అయిదు కోట్ల వ్యాపారం

ముప్పయ్‌ అయిదు కోట్ల వ్యాపారం

ఇప్పటికే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ముప్పయ్‌ అయిదు కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో పాటు విడుదలవుతోన్న మిగతా రెండు సినిమాలతో పోలిస్తే ఇదే అదిరిపోయే బిజినెస్‌. ఈ లెక్కన చూస్తే మిగతా రెండు సినిమాల్లో ఏక్కటి కాస్త అటూ ఇటూ అయినా జానకీనాయకుడికి పేద్ద విజయం లభించినట్టే అనుకోవాలి..

English summary
Bellamkonda Srinivas, Rakulpreeth singh's Movie Jaya Janaki Nayaka , How Much Should It Bring?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu