»   » బోయపాటి స్టైలే మారిపోయిందిగా: జయ జానకీ నాయక టీజర్

బోయపాటి స్టైలే మారిపోయిందిగా: జయ జానకీ నాయక టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మొదట్లో కాస్త అటూ ఇటూ అనిపించినా పోనూ పోనూ మంచి పాజిటివ్‌బజ్ నే రాబట్టుకుంది.

బోయపాటి సినిమాలంటే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయన్న రొటీన్ అభిప్రాయాన్ని తుడిచి పెట్టేసాడు. తాజా టీజర్‌లో మాస్ ఛాయలు మచ్చుకైనా కనిపించకుండా తనలో మరో యాంగిల్‌ను బయటపెట్టాడు బోయపాటి. మాస్ ఫ్లేవర్‌తో నింపేస్తాడనుకున్న'జయజానకినాయక' టీజర్ టైటిల్‌కి తగ్గట్టే పూర్తి క్లాస్‌ టచ్‌లో ఉన్న ఈ టీజర్‌ను రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేేసింది.

ఫస్ట్ లుక్ ను కూడా రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనిపించేలా డిజైన్ చేసిన చిత్రయూనిట్ టీజర్ ను కూడా అదే స్టైల్ లో రిలీజ్ చేసింది. బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా లేకుండానే కూల్ కాలేజ్ లవ్ స్టోరీలా టీజర్ ను కట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

English summary
Boyapati Srinivas is now coming up with ‘Jaya Janaki Nayaka’ in which Bellamkonda Sai Srinivas is playing the lead role teaser is released today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu