twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమృతవల్లి నుంచీ తమిళతల్లి వరకూ..... అయిష్టంగానే సినిమాల్లోకి (అరుదైన ఫొటోలు)

    ఒక రాష్ట్ర నేతగా శతాబ్దాలైనా మరువలేని ముద్ర వేసింది. నటిగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాలు,జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. తమిళనాట ఒక రాజకీయ శక్తిగా సాగిన వి"జయ"యాత్ర ఇ

    |

    ఒక శకం ముగిసింది... మూడు దశాబ్దాల నట జీవితం, దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం వేరసి "పురచ్చి తలైవి" అన్న పేరు. ఆమె ఒక జాతిమొత్తానికీ అమ్మ గా పిలవబడింది. ఒక రాష్ట్ర నేతగా శతాబ్దాలైనా మరువలేని ముద్ర వేసింది. నటిగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాలు,జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. తమిళనాట ఒక రాజకీయ శక్తిగా సాగిన వి"జయ"యాత్ర ఇక ముగిసింది. సోమవారం రాత్రి జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు.

    జయ లలిత నటించిన తెలుగు సినిమాలు ఇవే!

    జీవితమంతా దాదాపుగా వివాదాలతోనే నడిచింది ఏదైతే ఆమెకు పేరుతెచ్చిందో అదే తర్వాత ఆమె జీవితం లోకి దురదృష్తాన్నీ తీసుకు వచ్చింది, సినీ తారగా ఉన్నప్పుడు ఎమ్జీఆర్ తో పరిచయం, కుమారుడి పెళ్ళి, రాజకీయ ప్రవేశం, సంపదా, స్నేహితులూ ఇలా ప్రతీదీ తర్వాతి కాలం లో ఆమెకు ఏదో రకం గా ధుఖాన్నే ఇచ్చ్హాయి. దాదాపు యాభై ఏళ్ల క్రితం 'వెన్నిర ఆడై' అనే తమిళ సినిమా విడుదలైంది. "వెన్నెల ఆడై" అంటే తెల్లచీర అంటూ అర్థం చెప్పుకోవచ్చు. సినిమా ఇతివృత్తం ఒక ఆడపిల్ల జీవితం. ఆ అమ్మాయి లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టనష్టాలు.. ఎత్తుపల్లాలే కథాంశం. జైల్లో ఖైదీలు ధరించే తెల్లచీరతో విషాదాంతంగా ఆ సినిమా తెర కిందకు దిగుతుంది. ఇంతకీ ఇంతటి విషాదపాత్ర పోషించిందెవరో తెలుసా.. జయలలిత ఉరఫ్ కోమలవల్లి. ఒక్కసారి జయలలిత జీవిత ప్రస్తానం ఎలా సాగిందో చూస్తే....

    కేవలం ముఖ్యమంత్రి కాదు:

    కేవలం ముఖ్యమంత్రి కాదు:

    జయలలిత అశేష అభిమానుల దృష్టిలో కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆమె ‘అమ్మ'. జనానికి నిత్యజీవనభారాన్ని ఎంతో కొంత తగ్గించే కొన్ని జనప్రియ పథకాలను ఆమె అమలు చేశారు. ఆవిధంగా ఆమెను ‘అమ్మ' అని పిలుచుకోవడంలో అభిమాన, ఆత్మీయతలతోపాటు ఆరాధనాభావం కూడా కలగలసి ఉంటుంది.

    ఇప్పుడు అదంతా ఒక ఙ్ఞాపకం:

    ఇప్పుడు అదంతా ఒక ఙ్ఞాపకం:

    జయలలిత అన్న పేరు ఒక్క తమిళనాడుకో లేదంTea కర్ణాటకకో, కేవలం తమిLaనాడుకో సొంతం కాదు ఒకానొక దశలో జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలిగిన ఐరన్ లేడీ ఆమె.., అంతకుముందే మరెందరికొ కలలరాణి ఒకప్పటి వెండితెర అప్సరస.., అయితే ఇప్పుడు అదంతా ఒక ఙ్ఞాపకం... జయ ఇప్పుడు ఒక వ్యక్తిగా కాక ఒక అద్బుతమైన చారిత్రక మహిళ గా నిలిచిపోనుంది... కొన్ని వేలగుండేలమీద నిలిచిన అమ్మ ఇక ఆ హృదయాల్లోనే కనిపించనుంది....

    మొట్టమొదటి సినిమా:

    మొట్టమొదటి సినిమా:

    ఈ వెన్నిరాడై సినిమానే జయ నటించిన మొట్టమొదటి సినిమా..,జయ జీవితానికి సరిగ్గా సరిపోయినట్టు అనిపించటం కాకతాళియమేనా..? జయలలిత జీవితం విషాదభరితమా.. వినోదాల మిళితమా అన్నదానికి సరిగ్గా సమాధానాలు చెప్పుకోలేంగానీ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుని తల్లితోబాటు బెంగుళూరు వచ్చేసి పదిహేనేళ్ళ వయసులోనే సినిమా నటిగా రంగప్రవేశం చేసింది.

    జీవితం సమస్తం పూలూ.. ముళ్ళే:

    జీవితం సమస్తం పూలూ.. ముళ్ళే:

    తల్లి ‘సంధ్య'గా సినిమాల్లో నటించిన నేపధ్యం. తండ్రి మైసూర్ మహారాజా సంస్థానంలో డాక్టర్ ! ఆటపాటలతో బాటు చదువుల తల్లిగా మంచిపేరు సంపాదించుకున్న జయ జీవితం సమస్తం పూలూ.. ముళ్ళే ! సినిమా ప్రపంచంలో ఆమె ప్రవేశం కూడా కాకతాళీయమే.. వేసవి సెలవుల్లో మాత్రమే నటిస్తాను.. నేను డాక్టరవుతాను కానీ యాక్టర్ని కానంటూ మంకుపట్టు పట్టిన జయ చివరకు యాక్టరే అయి అక్కడినుంచి రాజకీయాల బాట పట్టింది.

    గొప్ప అవార్డులు:

    గొప్ప అవార్డులు:

    ఆమెకు నటిగా దక్కిన గౌరవాలు... దక్కించుకున్న అవార్డులు గొప్పవే ! తమిళం, కన్నడం, మళయాళం, తెలుగుభాషలతో పాటు ఇంగ్లీషు భాషలో సైతం ఆమెకున్న ప్రావీణ్యాలకు పెద్దోళ్ళు సైతం ఆశ్చర్యపడేవాళ్ళు ఆమెలోని భాషాప్రావీణ్యం- అద్భుతమైన ఉపన్యాసపు కళలే ఆనాటి ఎఐఎడిఎంకె ఎంజి రామచంద్రన్‌ను ఆకట్టుకున్నాయి.

    రూపాయి జీతంతోనే :

    రూపాయి జీతంతోనే :

    అసలు ‘సినిమా టు పాలిటిక్స్' అనే సబ్జెక్ట్‌కే ఈ దేశంలో ముందుగా తెరతీసిన తమిళనాడు అక్కడే ముగ్గురు ముఖ్యమంత్రులకు పట్టం కట్టేసింది. ఎంజీఆర్ ఉరఫ్ ఎంజిరామచంద్రన్, కరుణానిధి ఆ తర్వాత ఇదిగో ఈమె.. జయలలిత ! రూపాయి జీతంతోనే సిఎంగా కుర్చీనెక్కిన ఈ ‘అమ్మ' అచిరకాలంలోనే అరవై అయిదు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంది.

    తమిళనాడు ఫస్ట్ విమెన్ చీఫ్‌మినిస్టర్‌:

    తమిళనాడు ఫస్ట్ విమెన్ చీఫ్‌మినిస్టర్‌:

    నాలుగేళ్ళ జైలు.. వందకోట్లు జరిమానా...! ఆ మాటకొస్తే జయపాలనలో జైత్రయాత్రలూ లేకపోలేదు. మొదటి మహిళా పోలీస్‌స్టేషన్లు- మొదటి విమెన్ బెటాలియన్- ఆడపిల్లల్ని దత్తత తీసుకునే పథకం వగైరాలన్నీ ఈ తమిళనాడు ఫస్ట్ విమెన్ చీఫ్‌మినిస్టర్‌తోనే సాధ్యమయ్యాయి. అయితే ఇదే జయలలిత గిన్నీస్ పుస్తకాల్లోకి ఎక్కేసిన ఘనచరిత్రను కూడా సొంతం చేసుకుంది.

    గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది:

    గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది:

    తన దత్తపుత్రుడైన సుధాకర్ పెళ్లికోసం లక్షాయాభైవేలమంది అతిధుల్ని ఆహ్వానించుకుని అంగరంగవైభవాల్ని ఆరబోసిన వైనమే గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది. అంతేకాదు అక్కడే అదే బుక్‌పేజీలోకి దూరిన ఇంకో ఘట్టం కూడా నమోదైపోయింది. అదే ఓ పెళ్ళి విందుకోసం ఏర్పాటుచేసుకున్న అతిపెద్ద వేదిక ! అయితే ఇవన్నీ నా ఖర్చుతో చేయలేదు... పెళ్ళికుమార్తె కుటుంబం పెట్టిన ఖర్చంటూ ఆనాటి ఆరుకోట్ల ఖర్చు వ్యవహారాన్ని కోర్టుకు విన్నవించుకుంది.

    39 తెలుగు సినిమాల్లో :

    39 తెలుగు సినిమాల్లో :

    జయలలిత భారత దేశ రాజకీయాల్లో నే కాదు దక్షిణ భారత దేశ సినిమాలోనూ చెరగని ముద్రే వేసారు. అటు తమిళ ఇండస్ట్రీలో హీరోయింగా గుర్తింపు తెచ్చుకున్నా జయ తెలుగు సినిమా రంగం లోనూ ఒక వెలుగు వెలిగారు. ఒకటీ అరా కాదు మొత్తం 39 సినిమాల్లో జయ హీరోయిన్ గా నటించారు.
    కథానాయకుని కథ (1965)
    మనుషులు మమతలు (1965)
    ఆమె ఎవరు? (1966)
    ఆస్తిపరులు (1966)
    కన్నెపిల్ల (1966)
    గూఢచారి 116 (1966)
    నవరాత్రి (1966)
    గోపాలుడు భూపాలుడు (1967)
    చిక్కడు దొరకడు (1967)
    ధనమే ప్రపంచలీల (1967)
    నువ్వే (1967)

    తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి:

    తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి:

    ఇలా జయలలిత ఆనాటి అగ్ర కథానాయకులతో పాటు ఎన్నొ సినిమాలు చేసారు. అంతే కాదు ఈ తమిళ నాడు అమ్మ. తెలుగు స్పష్తంగా మాట్లాడగలరు కూడా. జయలలిత నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలూకాలోని మెల్కోటేలో 1948, ఫిబ్రవరి 24న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి(సంధ్య)లు. ఆ కాలంలో సంధ్య ప్రముఖ సినీ నటిగా వెలుగొందారు. జయరాం తాత మైసూరు సామ్రాజ్యంలో వైద్యునిగా పనిచేసేవారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది.

    ఈపిస్ట్లి అనే ఇంగ్లీష్ చిత్రం:

    ఈపిస్ట్లి అనే ఇంగ్లీష్ చిత్రం:

    ఆ తర్వాత చెన్నై కేంద్రంగా సాగుతున్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. అప్పుడే వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది. జయలలిత చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్‍‌లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. జయలలిత చదువులో రాణించడంతోపాటు తన తల్లి నటిస్తున్న చిత్రాలలో కూడా నటిస్తుండేది. చదువుకు ఆటంకం కలగకుండా ఆమె తల్లి చూసుకునేది. ఈ క్రమంలో ఆమె నటించిన ఈపిస్ట్లి అనే ఇంగ్లీష్ చిత్రం 1961లో విడుదలైంది.

    జాతీయ అవార్డు:

    జాతీయ అవార్డు:

    హీరోయిన్‌గా ఆమె మొదటిసారిగా నటించిన కన్నడ చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన ‘మనుషులు మమతలు' చిత్రంలో నటించారు. అలా జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు.

     ఎంజి రామచంద్రన్:

    ఎంజి రామచంద్రన్:

    ప్రముఖ సినీ నటుడు, అన్నాడిఎంకె అధినేత ఎంజి రామచంద్రన్ 1977లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982 ఏఐఏడిఎంకె పార్టీలో చేరారు. 1983లో తిరుచండుర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అయితే 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఆమె ఏఐఏడిఎంకె తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. తన పార్టీ సభలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు.

    రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ :

    రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ :

    కాగా, 1987లో రామచంద్రన్ మరణించారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత నాయకత్వం వహించారు. కాగా, జానకికి ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. 1989లో బొడినాయకన్నూర్ నుంచి ఏఐఏడిఎంకె తరపున శాసనసభ్యురాలిగా జయలలిత ఎన్నికయ్యారు.

    మొట్టమొదటి ప్రతిపక్ష నేత:

    మొట్టమొదటి ప్రతిపక్ష నేత:

    ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పుడు మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా ఆమె రికార్డు సృష్టించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడిఎంకె పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గానూ 225 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సమయంలోనే ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

    2001లో మళ్లీ సిఎం:

    2001లో మళ్లీ సిఎం:

    ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకున్నారు. 2001లో మళ్లీ జయలలిత సిఎం అయ్యారు. మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో ఆమె పదవి నుంచి తప్పుకుని.. ఆ స్థానంలో మంత్రివర్గంలోని పన్నీరు సెల్వంను సిఎంగా నియమించారు. 2011లో ముచ్చటగా మూడోసారి జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

    దేశం మొత్తం ఆమె ఆరోగ్యం గురించి ఆరా :

    దేశం మొత్తం ఆమె ఆరోగ్యం గురించి ఆరా :

    ఉన్నట్టుండీ అమ్మకి అనారోగ్యం అన్నారు... దాదాపు రెండు నెలలుగా ఎనో అనుమానాలు, మరెన్నో ఉత్కంఠ గొలిపే సంఘటనలు.. తమిళ ప్రజలేకాదు.. దేశం మొత్తం ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నాయి.. ఎప్పుడెప్పుడు వింటామోఅ అని భయపడుతున్న వార్త అసని పాతం లా తాకనే తాకింది...

    అమ్మ వెళ్ళిపోయింది:

    అమ్మ వెళ్ళిపోయింది:

    రాజ్యాల్నీ, రాజులనీ అపహాస్యం చేసిన "కన్నగి" తర్వాత మళ్ళీ అంతటి కీర్తిని (కొంత అపకీర్తినీ) పొందిన అమ్మ వెళ్ళిపోయిందంటే మాత్రం. బహుశా ఇక తమిళనాడు మళ్ళీ ఇంత శక్తివంతమైన మహిళని పొందటం ఇప్పట్లో కష్టమేమొ.. తమిళనాట ఒక రాజకీయ శక్తిగా సాగిన వి"జయ"యాత్ర ఇక ముగిసినట్టే. తమిళనాడు అమ్మకోసం కన్నీరు కారుస్తోంది.

    English summary
    Actress turned politician Jayalalitha’s Incredible Journey
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X