twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి పోస్టర్ వేస్తే నష్టం తగ్గేదేమో? ఆస్తులన్నీ అమ్ముకున్నాం: జయసుధ

    By Bojja Kumar
    |

    జయసుధ మనకు సహజనటిగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఒకప్పుడు నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారనేది ఈ తరం ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియదు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న జయసుధ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాతగా ఎంత నష్టపోయానో వివరించే ప్రయత్నం చేశారు. నితిన్ కపూర్‌తో పెళ్లి తర్వాత ఆమె నిర్మాతగా మారారు. అయితే వరుస నష్టాలతో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందట.

    భార్య డబ్బులతో చేయడం ఇష్టం లేక

    భార్య డబ్బులతో చేయడం ఇష్టం లేక

    వాస్తవానికి తన భర్త నితిన్ కపూర్‌ను దర్శకుడిగా తాను సినిమా నిర్మించాలని జయసుధ ఆశ పడింది. అయితే భార్య డబ్బుతో దర్శకుడిగా మారడం ఇష్టం లేక నితిన్ కపూర్ నో చెప్పారట. సినిమాలు నిర్మించడానికి ఆయన ఒప్పుకోవడంతో నిర్మాణ రంగంలోకి దిగారు.

    ఆ సినిమాలు ఫర్వాలేదు

    ఆ సినిమాలు ఫర్వాలేదు

    దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 'ఆత్మ బంధువులు' చేశాం. ఈ సినిమా బాగా ఆడింది. తర్వాత 'కాంచనసీత' నిర్మించాము. ఈ సినిమా ద్వారా రఘువరన్ ను ఇంట్రబ్యూస్ చేశాం. దీనికి కూడా దాసరిగారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ పెద్ద సక్సెస్ కాక పోయినా మా డబ్బులు మాకు వచ్చాయి అని జయసుధ తెలిపారు.

    హిందీలో దెబ్బపడింది

    హిందీలో దెబ్బపడింది

    నితిన్ కపూర్ హిందీలో సినిమాలు చేద్దామనడంతో తెలుగులో ....నేను, మోహన్ బాబు, వాణిశ్రీ చేసిన 'నా మొగుడు నాకే సొంతం' సినిమాను రీమేక్ చేశాం. ఇది ఒరిజినల్ తమిళ మూవీ. తమిళంలో ఆ సినిమా చేసిన మనోబాల హిందీకి దర్శకత్వం వహించారు. అది కొంతవరకూ దెబ్బకొట్టింది. రిలీజ్ ప్రాబ్లం వల్ల అలా జరిగింది.. అని జయసుధ గుర్తు చేసుకున్నారు.

    తెలుగులో మళ్లీ వరుస నష్టాలు

    తెలుగులో మళ్లీ వరుస నష్టాలు

    ఈ సినిమా తరువాత తెలుగులో చేసిన 'వింత కోడళ్లు' సినిమా చేసి నష్టపోయాం. 'అదృష్టం' కూడా నష్టాలనే తెచ్చిపెట్టింది. మేము ఎప్పుడూ ఇంగ్లిష్ సినిమాలు చూడటం. వాటిలాగా తీయాలని ప్రయత్నం చేయడం చేసేవాళ్లం. ‘అదృష్టం' మూవీ అలా చేసిన సినిమానే. అది జనాలకు అర్థం కాలేదు.

    చిరంజీవి పోస్టర్ వేస్తే నష్టం తగ్గేదేమో?

    చిరంజీవి పోస్టర్ వేస్తే నష్టం తగ్గేదేమో?

    ఆ తరువాత చేసిన 'హ్యాండ్సప్' సినిమాతో దాదాపు ఆస్తులన్నీ పోయాయి. ఈ చిత్రంలో చిరంజీవిగారు గెస్ట్ రోల్ చేశారు. ఆయన పోస్టర్ వేసినా ఆడేదేమో? అయితే ఆయనది గెస్ట్ రోల్ కావడంతో పోస్టర్ వేయొద్దన్నారు. పోస్టర్ వేస్తే పెద్ద క్యారెక్టర్ ఉంటుందనుకుంటారు. నేరుగా వచ్చి చూస్తే సర్ ప్రైజింగ్ ఉంటుందన్నారు. అది మాకు రివర్స్ కొట్టింది. ఓపెనింగ్స్ రాలేదు. ఇలా ప్రతి సినిమాకు ఒక్కొక్క ప్రాపర్టీ ఎగిరిపోతూ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు.

    English summary
    Jayasudha in Alitho Saradaga show. Ali tho Kaasepu is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X