»   » జయసుధ భర్తను గాయపరిచిన యువకులు!

జయసుధ భర్తను గాయపరిచిన యువకులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య హీరోలు ఫుల్ గా త్రాగి కారులను రాంగ్ రూట్ లో నడుపుతూ పోలీసులకు చిక్కుతున్న విషయం తెలిసిందే అయితే కొందరు యువకులు కారు రేస్ లు పెట్టుకుని సుమారు150కిమీ వేగంతో కారు నడుపుతుంటే ఓ పెద్ద మనిషి వారిని ఆపి అంత వద్దు ప్రాణాలకు ప్రమాదం అని చెప్పినా వారు వినలేదు. వారు వినకపోవడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేయబోతే ఆ యువకులు ఆ పెద్దమనిషి పై చేయి చేసుకున్నారు ఏ స్థాయిలో అంటే చెవుల వెంట రక్తం వచ్చేలా కొట్టిపడేశారట. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరనుకొంటున్నారా సికింద్రాబాద్ ఎమ్యేల్యే నటి జయసుధ భర్త నితిన్ కుమార్.

పబ్లిక్ ఇబ్బంది పడకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం ఆయననే కొట్టి పడేసేలా చేసింది. దీంతో ఆగ్రహావేశానికి గురైన జయసుధ వెంటనే పోలీసు కేసు పెట్టి ఆ యువకులను పట్టుకోవాలని పోలీసులకు అర్డర్ జారీ చేసింది. మామూలుగా సామాన్యుడు ఎంత మెర పెట్టుకున్నా పలకని పోలీసులు ఎమ్మేల్యే కావడంతో జయసుధ అలా అర్డర్ వేసిందో లేదో గంటలో వారిని వెతికి పట్టుకుని అవినాష్ గోయల్, ఆదిత్య గోయల్, శశాంక్ గోయల్ లే ఈ పని చేశారని పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారిని ఆమె ముందు నిలబెట్టారు.

దీని గురించి జయసుధ మాట్లాడుతూ 'నేను ఓ ఎమ్మేల్లేగా ఈ కేస్ ను మూవ్ చేయడం లేదు. మా వారిని చాలా తీవ్రంగా గాయపరిచారు. ఇలాంటి సంస్కతి మంచిది కాదు. వెంటనే పోలీసులు ఇలాంటివి జరగకుండా ఆపాలి అన్నారు. తన భర్త మీద దాడికి స్పందించినట్టుగా ఎమ్మేల్యేగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చడానికి కూడా ఇంత కరెక్ట్ గా ఉంటే బావుణ్ణు అని ఆమె నియోజకవర్గంలోని ప్రజలు అనుకుంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu