»   » భవనంపై నుంచి దూకి నితిన్‌కపూర్ సూసైడ్.. గతంలో ఆత్మహత్యాయత్నం

భవనంపై నుంచి దూకి నితిన్‌కపూర్ సూసైడ్.. గతంలో ఆత్మహత్యాయత్నం

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య వెనుక అనుమానాస్పద అంశాలు లేవని ముంబై పోలీసులు పేర్కొంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు నితిన్‌కపూర్‌ ఓ భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

సోదరి ఇంట్లో నివాసం..

సోదరి ఇంట్లో నివాసం..

ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్‌లో ఉన్న సీ గ్లింప్స్ అపార్ట్‌మెంట్‌లోని సోదరి ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటినే నితిన్ కపూర్‌ తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు.

తలుపులు పగులకొట్టి.. బిల్డింగ్ మీద నుంచి

తలుపులు పగులకొట్టి.. బిల్డింగ్ మీద నుంచి

అపార్ట్‌మెంట్ పైన ఉన్న టెర్రస్ డోర్స్‌కు వేసిన తాళాన్ని పగులగొట్టి పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి నితిన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

గతంలోనూ ఆత్మహత్యా ప్రయత్నం

గతంలోనూ ఆత్మహత్యా ప్రయత్నం

జయసుధ భర్త, సినీ నిర్మాత నితిన్ కపూర్ మరణం వెనుక దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ కూడా నితిన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. 18 ఏళ్లుగా సరైన విజయాలు లేకపోవడం ఆయన కుంగదీసినట్టు తెలుస్తున్నది.

ముంబై హాస్పిటల్ డిప్రెషన్‌కు చికిత్స

ముంబై హాస్పిటల్ డిప్రెషన్‌కు చికిత్స

ముంబై పోలీసుల తెలిపిన ప్రకారం నితిన్ గతంలో కూడా ఓసారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం ఉంది. గత కొద్దికాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి కోకిలాబెన్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నారు అని పోలీసులు వెల్లడించారు. నితిన్ మృతదేహానికి పంచనామా పూర్తి చేసి పోస్ట్ మార్టం కోసం తరలించారు.

English summary
Jayasudha's husband Nitin Kapoor, who is a producer was found dead at his office in Mumbai on March 14. Nitin Kapoor is the cousin of Bollywood actor Jithendra and got married to actress Jayasudha in the year 1985 after two years of love.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu