»   » నితిన్ మృతికి కారణాలు అవేనా.. కొడుకులు లేని సమయంలో..

నితిన్ మృతికి కారణాలు అవేనా.. కొడుకులు లేని సమయంలో..

Written By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మరణం వెనుక అనేక వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాలతో ముడిపడిన ఆర్థిక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. అంతేకాకుండా కుమారుడు శ్రేయాన్‌తో నిర్మించిన బస్తీ చిత్రం కూడా నష్టాలను మిగల్చడం ఆయనను కుంగదీసినట్టు తెలుస్తున్నది.

Jayasudha

ఇటీవలి కాలంలో నితిన్ కొన్ని హిందీ చిత్రాలలోనూ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన వ్యవహారాలు బెడిసికొట్టడం, వాటివల్ల అప్పుల బారిన పడటం మృతికి కారణమై ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

ఈ విషాదం చోటుచేసుకొన్నప్పుడు జయసుధ కుమారులు ముంబైలోనే ఉన్నారు. వీరు ఇంటివద్ద లేని సమయంలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. నితిన్ అంత్యక్రియలు ముంబైలోనే జరుగుతాయని తెలిసింది.

English summary
Popular South Indian actress Jayasudha’s husband Nitin Kapoor passed away today.he has committed suicide by consuming poison. He was found dead in his Mumbai office on March 14.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu