కన్న కొడుక్కి శిక్ష వేసిన జయసుధ (వీడియో)
హైదరాబాద్ : సీనియర్ నటి జయసుధ తన కొడుకుకి శిక్ష వేసారా... అవును..అయితే అది నిజం కాదు..ఏంటి కన్ఫూజన్ అంటారా...అయితే మీరు అర్జెంటుగా ఈ క్రింద వీడియో చూడాల్సిందే. సైబరాబాద్ జోన్‌లో అమ్మాయిలను వేధించే ఆకతాయిల పని పట్టేందుకు పోలీసులు 'షీ టీమ్'ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఒక లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్)ని రూపొందించారు. ఆ షార్ట్ ఫిలిం ఇక్కడ...
ఈ షార్ట్ ఫిల్మ్ లో అమ్మాయిల వెంటపడే బ్యాచ్‌ను పోలీసులకు పట్టిస్తారు మన సహజనటి. అందులో ఆమె కొడుకు కూడా ఉంటాడు. ఈ తతంగం ముగిసిన తర్వాత అక్కడే సినిమా చూసినట్టు నుంచున్న ప్రజలను ఉద్దేశిస్తూ చెప్పిన 'అయిపోయాక తిట్టడం కాదు అవుతున్నపుడే ఆపడం నేర్చుకోండి' అంటారామె. జయసుధ కుమారుడు అనగానే 'బస్తీ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రేయాన్ కాదు...స్క్రీన్ కొడుకు అంతే.


Click it and Unblock the Notifications