»   » ఫస్ట్ స్టిల్.... ఐశ్వర్యరాయ్ వాదిస్తోంది!

ఫస్ట్ స్టిల్.... ఐశ్వర్యరాయ్ వాదిస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో? అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె సంజయ్ గుప్తా దర్శకత్వంలో ‘జజ్బా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది.

ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ న్యాయవాది పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో ఆమె లాయర్ పాత్రలో వాదిస్తున్న ఫోటో బయటకు వచ్చింది. ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర చూనిట్ సభ్యులు అంటున్నారు.

Jazbaa: New look of Aishwarya Rai

ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 15 నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
An official still of Aishwarya Rai Bachchan's comeback movie 'Jazbaa' have been released. New look of Aishwarya who plays a Lawyer in the movie is simply superb.
Please Wait while comments are loading...