For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ వెన్నపోటు పర్వం... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత ఇతడే!

  By Bojja Kumar
  |

  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఎన్టీఆర్' జీవితం మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్‌తో తెరకెక్కుతుందని ప్రకటించారు కూడా.

  'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో అన్నీ నగ్న సత్యాలు, సంఘటనలు చూపిస్తానని... ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిందెవరు? ముందు నుండి కడుపులో గుద్దింది ఎవరు? అనే విషయాలు వెల్లడిస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్పడం.... తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

  రిస్క్ చేయడానికి ఇష్టపడని చాలా మంది నిర్మాతలు

  రిస్క్ చేయడానికి ఇష్టపడని చాలా మంది నిర్మాతలు

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనేది చాలా వివాదాస్పద అంశాలతో కూడిన సినిమా. రేపు ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు. నిర్మాతకు భారీ నష్టం తప్పదు. అందుకే ఈ వివాదాస్పద ప్రాజెక్టును చేయడానికి చాలా మంది నిర్మాతలు భయ పడుతున్నారు.

  నిర్మాత ఇతడేనా?

  నిర్మాత ఇతడేనా?

  తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నిర్మించడానికి జెడి చక్రవర్తి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వర్మకు అత్యంత సన్నిహితుడు, శిష్యుడు అయిన జెడీ ఈ ప్రాజెక్టును తెరపైకి తేవడానికి సిద్ధమైనట్లు సమాచారం.

  లక్ష్మీపార్వతిని కలిసిన జెడి

  లక్ష్మీపార్వతిని కలిసిన జెడి

  ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్ తీసేందుకు అనుమతి కోసం ఇటీవలే జెడి చక్రవర్తి... ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతిని కలిసినట్లు తెలుస్తోంది. తమ సినిమా కాన్సెప్టు ఏమిటి? ఏయే విషయాలు సినిమాలో ఫోకస్ చేస్తాం అనే వివరాలు వెల్లడించి ఆమెను కన్సిన్స్ చేసినట్లు సమాచారం. అయితే ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత అది చూసి తాను అనుమతి ఇస్తానని లక్ష్మి పార్వతి చెప్పినట్లు తెలుస్తోంది.

  ఆ రహస్యాలు ఈ సినిమా ద్వారా

  ఆ రహస్యాలు ఈ సినిమా ద్వారా

  ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వాస్తవాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తానని, ఆయన జీవితం చివర్లో జరిగిన సంఘటనల వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి? ఎవరు? ఇదంతా చేశారు అనే విషయాలు సినిమాలో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ వెల్లడించంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

  శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో?

  శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో?

  అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేషతెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని వర్మ ఇప్పటకే ప్రకటించారు.

  నేను గర్వించే సినిమా

  నేను గర్వించే సినిమా

  నాకు ఎన్టీఆర్‌తో పర్సనల్‌గా ఉన్న అనుబంధం ఏమిటంటే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అడవిరాముడు' చూడటానికి 23 సార్లు బస్సు టికెట్‌కి డబ్బులు లేక 10 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్లే వాడిని. అంతే కాకుండా ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేలఈనినట్లు వచ్చిన లక్షలాది మందిలో నేనూ ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇపుడు ఎన్టీఆర్ జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకెక్కించడం చాలా చాలా గర్వంగా ఫీలవుతున్నాను... అని వర్మ గతంలో ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.

  ఏ మాత్రం భయపడని వర్మ

  ఏ మాత్రం భయపడని వర్మ

  ఈచిత్రం ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు వర్మను టార్గెట్ చేశారు. ఈ సినిమా విషయంలో తనను టార్గెట్ చేసిన వారికి వర్మ ఏ మాత్రం భయపడకుండా ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు.

  ఆమెలో ఏదో ప్రత్యేకత లేకపోతే ఎన్.టి.ఆర్ గారు ఎందుకు

  ఆమెలో ఏదో ప్రత్యేకత లేకపోతే ఎన్.టి.ఆర్ గారు ఎందుకు

  అలాగే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లాంటి అతి గొప్ప మహానుభావుడినే ప్రభావితం చేసిందంటే ఆమెలో ఏదో ప్రత్యేకత లేకపోతే ఎన్.టి.ఆర్ గారు ఎందుకు ఆకర్షితులౌతారు అనే ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం నేను నా సినిమాలో చూపించదలచుకున్నాను.... అని వర్మ వాదిస్తున్నారు.

  దొంగ ఫాలోవర్ల విషయం కూడా...

  దొంగ ఫాలోవర్ల విషయం కూడా...

  ఎన్.టి.ఆర్ గారి నిర్ణయాలను అవమానిస్తే సాక్షాత్తు ఎన్.టి.ఆర్ గారిని అవమానించినట్టే. ఆయన మీదున్న గౌరవం ఈ భూమి మీద ఉన్నంతవరకే కాదు, ఆ తర్వాత కూడా నిలబెట్టాలి. అప్పుడే ఎన్.టి.ఆర్ గారి ఆత్మకి శాంతి కలిగించినట్టు . యన్ని ఫాలో అవ్వడం అంటే ఆయన నిర్ణయాల్ని ఫాలో అవ్వడం. ఆ నిర్ణయం ఏదైనా "బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్" అనే నిజాయతీ ఉన్నప్పుడే వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు అవుతారు. అలా ఆయా నిర్ణయాల్ని ఫాలో అయినా వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు . లేకపోతే వాళ్ళు దొంగ ఫాల్లోవర్లు.... అలాంటి వారి విషయాలు తన సినిమా ద్వారా బయట పెడతానని వర్మ తేల్చి చెబుతున్నారు.

  చరిత్ర కాల్చేస్తే కాలిపోదు

  చరిత్ర కాల్చేస్తే కాలిపోదు

  చరిత్ర అనేది ఎవరో చింపేస్తే చిరిగిపోవడానికో కాల్చేస్తే కాలిపోవడానికి దాచేస్తే తెలియకుండా పోవడానికి వెర్రిబాగులది కాధు ..తెలుగు చరిత్రని గర్వంగా తల ఎత్తుకు తిరిగేటట్టు చేసిన ఘనత ఎన్.టి.ఆర్ గారిది.... దాన్ని అందరికీ తెలిసే చేస్తాను అని వర్మ అంటున్నారు.

  English summary
  The latest sources in the filmnagar reveal us that the actor J D Chakravarthi is likely to produce the film titled Lakshmi's NTR. Apparently, we have come to know that JD had approached Lakshmi Parvathi on behalf of Varma to take permission to make the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X