Just In
Don't Miss!
- News
జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మెరిసిన నల్లజాతి యువ కవయిత్రి అమండా గోర్మాన్
- Finance
డిసెంబర్ నెలలో గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే
- Sports
IPL 2021: తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Automobiles
భారత్‌లో కొత్త వోల్వో ఎస్60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు
- Lifestyle
Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘‘నాగార్జున కొడితే కాలర్ పట్టుకున్నా.. అన్నపూర్ణ స్టూడియో డ్రైవర్లు నా తలబద్దలు కొట్టబోయారు’’
ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి 1989లో 'శివ' మూవీ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. నాగార్జున హీరోగా రూపొందిన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించడంతో... వర్మ వద్ద శిష్యరికం చేసిన జేడీ ఇందులో నటించే అవకాశం దక్కించుకున్నారు.
తాజాగా అలీ హోస్ట్ చేస్తున్న 'అలీతో సరదాగా' అనే షోకు హాజరైన జేడీ చక్రవర్తి తన తొలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోలో హీరో నాగార్జునతో గొడవ పడ్డట్లు వెల్లడించారు.

నాగార్జున నాపై చేయి చేసుకున్నాడు
‘‘శివ షూటింగ్ సమయంలో నాగార్జున లంచ్ చేసి వస్తున్నారు. ఆయన వస్తున్న విషయం నేను గమనించలేదు. ఎటో చూసుకుంటూ వస్తుండగా నా భుజం తగిలింది. దీంతో ఆయనకు కోపం వచ్చిన ‘ఏయ్ ఎటు చూసి నడుస్తున్నావ్ అంటూ నాపై ఫైర్ అయ్యారు. లేదండీ నేను చూడలేదు అన్నా వినలేదు. ఏంట్రా మాట్లాడుతున్నావ్ అంటూ లాగి కొట్టాడు'' అని జేడీ గుర్తు చేసున్నాడు.

కోపం వచ్చి ఆయన కాలర్ పట్టుకున్నాను
‘‘ఆయన అలా కొట్టడంతో నేను కింద పడిపోయాను. కోపంగా లేచి ఆయన కాలర్ పట్టుకున్నాను. దీంతో అన్నపూర్ణ స్టూడియోలో పని చేసే డ్రైవర్లు నా తల పగలకొట్టడానికి రాడ్లు పట్టుకుని వచ్చారు.'' అని జేడీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏ జరిగింది? జేడీ ఏం చెప్పాడు అనే విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తూ ‘అలీతో సరదాగా' షో ప్రోమో ముగిసింది. జూన్ 24న ప్రసారం అయ్యే షోలో దీనిపై పూర్తి కార్లిటీ రానుంది.

శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది
శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని వాళ్ల అమ్మ నన్ను అడిగిన మాట నిజమే అని అలీ అడిగిన ఓ ప్రశ్నకు జేడీ చక్రవర్తి సమాధానం ఇచ్చారు. ఓసారి రామ్ గోపాల్ వర్మగారు నేను హీరోగా నటించిన ‘మనీ' సినిమా శ్రీదేవి గారికి చూపించారు. సినిమా ముగిసిన అనంతరం నన్ను బెస్ట్ యాక్టర్ అంటూ ప్రశంసించారని జేడీ తెలిపారు.

జేడీ చక్రవర్తి
తెలుగులో ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన జేడీ చక్రవర్తి పలు విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. హీరోగా కెరీర్ ముగియడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘హిప్పి' మూవీలో ఆయన కీలక పాత్రలో నటించారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా నిలిచింది.

తెలుగులో మళ్లీ బిజీ కాబోతున్నారా?
‘హిప్పి' మూవీ తర్వాత జేడీ చక్రవర్తి తెలుగు మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన ఇకపై వరుస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారని, దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడటానికే మీడియాలో హైలెట్ అవుతున్నట్లు చర్చించుకుంటున్నారు.