»   »  ఎట్టకేలకు జెడీ చక్రవర్తి పెళ్లి చేసుకోబోతున్నాడు!

ఎట్టకేలకు జెడీ చక్రవర్తి పెళ్లి చేసుకోబోతున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు జెడి చక్రవర్తి ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు ఎంతో తెలుసా..... అక్షరాల 46 సంవత్సరాలు. మరో నాలుగేళ్లు పోతే హాఫ్ సెంచరీ క్రాస్ అయ్యేవాడు. ఇపుడు కూడా వాళ్ల అమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకోబోతున్నాడట.

ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని జేడీ పెళ్లి చేసుకోనున్నాడు. మరికొన్ని నెలల్లో ఈ పెళ్లి జరగనుంది. 'నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత - మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నా' అంటున్నాడు జేడీ చక్రవర్తి.

JD Chakravarthy is tying the knot soon

జేడీ చక్రవర్తి అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. అమ్మ కర్ణాటక సింగర్ శాంత. తండ్రి నాగులపాటి సూర్యనారాయణ రావు. సెయింట్ జార్జ్ గ్లామర్ స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేసాడు. తర్వాత చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బి.ఇ పూర్తి చేసాడు.

సినిమా రంగం మీద ఆసక్తితో 1989లో వచ్చిన రామ్ గోపాల్ వర్మ మూవీ శివతో అరంగేట్రం చేసిన చక్రవర్తి తర్వాత హీరోగా, విలన్ గా, దర్శకుడిగా ఎదిగాడు. 'సత్య' మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

English summary
Popular actor J.D. Chakravarthy is all set to tie the knot. The actor, who made his debut with Ram Gopal Varma’s Siva in 1989, has finally agreed to get hitched, for his mother’s sake, says a source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu