రోబోలో జెడి విలన్

శంకర్ దర్శకత్వం వహిస్తున్న రోబోలో మెయిన్ విలన్ పాత్ర జెడిదేనట. శివాజీ సినిమాలో విలన్ గా నటించిన సుమన్ తనదైన మానరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి అతను బిజీ అయ్యాడు. అందువల్ల రోబో తర్వాత తన జాతకం మారిపోతుందని జెడి ఆశపడుతున్నాడని అంటున్నారు. తాజాగా జగపతిబాబు హీరోగా జెడి హోమం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. తాజాగా సర్వమ్ అనే తమిళం సినిమాలో ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించాడు. ఇక జెడి బిజీ అయిపోయినట్లే భావించాలి.


Click it and Unblock the Notifications











