twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేడీ చక్రవర్తికి వర్మ మొండిచేయి.. ‘వైస్రాయ్’ అంటూ చంద్రబాబుపై సెటైర్లు

    By Rajababu
    |

    నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రం విడుదలకు ముందే సోషల్ మీడియాలో హిట్టయి కూర్చున్నది. దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో స్పందిస్తున్న తీరుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తున్నది. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి వర్మ ఫేస్ బుక్‌లో వేసిన సెటైర్‌ మరోసారి గందరగోళానికి దారి తీసింది. అసలేం జరిగిందంటే..

    జేడీ చక్రవర్తికి నో చాయిస్

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి పోషిస్తున్నాడనే వార్త ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ చర్చ మరోస్థాయికి చేరుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో వర్మ ఫేస్‌బుక్‌లో స్పందించాడు.

     నాకే క్లారిటీ లేదు..

    నాకే క్లారిటీ లేదు..

    లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రంలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా నాకే క్లారిటీ లేదు. అయితే చంద్రబాబు నాయుడు పాత్రలో జేబీ నటించడు అనే స్పష్టతను మాత్రం వర్మ ఇవ్వడం గమనార్హం.

     వైస్రాయిలో చంద్రబాబు..

    వైస్రాయిలో చంద్రబాబు..

    వైస్రాయి ఘటనలో చంద్రబాబు పాత్రపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి తప్పించే క్రమంలో వైస్రాయి హోటల్‌లో చంద్రబాబు ఏమి చేశాడో.. ఎలాంటి పాత్రను పోషించాడో అనే విషయంపై నాకు క్లారిటీ లేదు అని వర్మ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు.

     లక్ష్మీస్ చుట్టూ అనేక వివాదాలు

    లక్ష్మీస్ చుట్టూ అనేక వివాదాలు

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన వ్యవహారం చూస్తే పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్టు ఉందనే సామెత గుర్తుకొస్తున్నది. సినిమా ప్రారంభం కాకముందే అనేక వివాదాలు ఈ చిత్రాన్ని వెంటాడటంపై సినీ ప్రముఖుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    English summary
    Director Ram Gopal Varma clarified one more thing about Lakshmi's NTR. He posted in facebook that, I don’t know who’s playing who between me and Lakshmi’s NTR but J.D chekri for sure is not playing CBN but I really don’t know what CBN was not playing at what was really playing at viceroy hotel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X