»   »  షూటింగ్ లో ప్రమాదం ...జెడికీ తీవ్ర గాయం

షూటింగ్ లో ప్రమాదం ...జెడికీ తీవ్ర గాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu
JD Chakravarti
నటుడు,దర్శకుడు అయిన జెడీ చక్రవర్తి ప్రస్తుతం తమిళ చిత్రం సర్వం రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే నిన్న హీరో ఆర్య,విలన్ గా చేస్తున్న జె.డి లపై తీస్తున్న యాక్షన్ సీక్వెన్స్ లో అనుకోని ప్రమాదం జరిగి జె.డి తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. తమిళనాడు లోని Munar వద్ద స్టంట్ మాస్టర్ త్యాగరాజన్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్ లో టైమింగ్ మిస్సయింది. దాంతో ఏక్సిడెంటల్ గా అతని ఛాతీ ప్రక్కన తీవ్ర గాయమైంది.

ఫెయింట్ అయి పడిపోయిన అతనని వెంటనే హాస్పటిల్ కి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేసారు. అనంతరం కొద్దిపాటి పరీక్షలు చేసిన డాక్టర్లు ఛాతీ ఎముక ఫాక్చర్ అయిందని అనుమానం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ప్రాణాలకైతే ప్రమాదం లేదు గానీ ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. షూటింగ్ ని టెంపరరీ గా ఆపుచేయటం జరిగింది. ఇక ఈ చిత్రానికి భీల్లా ఫేమ్...విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక జె.డి ప్రతిష్టాత్మకంగా శంకర్ రూపొందిస్తున్న చిత్రంలోనూ విలన్ గా ఎంపికయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X