For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాకు ఎవరూ లేరా అనుకున్నాం.... చిరు, మహేష్, రాజమౌళి ఫోన్ చేశారు: జీవిత

  By Bojja Kumar
  |
  చిరంజీవితో విభేదాలు సృష్టించొద్దు.. కంటతడి పెట్టిన రాజశేఖర్

  రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పిఎస్‌వి గరుడవేగ'. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. సందర్భంగా జీవిత మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

  ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఎలా థాంక్స్ చెప్పాలో మాటలు రావడం లేదు. సినిమా రిలీజ్ సమయంలో మా అన్నయ్య పోవడం చాలా దురదృష్టకరం. భగవంతుడు ఇంత సక్సెస్ ఇచ్చాడని సంతోష పడుతున్నపుడు ఆయన ఎంత దు:ఖాన్నిఇచ్చినా అదే మనసుతో యాక్సెప్ట్ చేయాలి. దాన్ని యాక్టెప్ట్ చేస్తూ మన జీవితంలో ప్రతి చర్యకు కారణం ఉంటుంది అని ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాం. పోరాడతాం, వి నెవర్ లుక్ బ్యాక్.... అని జీవిత వ్యాఖ్యానించారు.

  చాలా కష్టాలు పడ్డాం

  చాలా కష్టాలు పడ్డాం

  ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ఫైనాన్షియల్‌గా చాలా కష్టపడ్డాం. దర్శకుడు ప్రవీణ్ గురించి ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. దర్శకుడిగా నా బాధ్యత ఇంతే, షూటింగ్ పెడితే నన్ను పిలవండి అని కాకుండా ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా సినిమాకు సంబంధించి ప్రతి ప్రాబ్లమ్ నాదే అని ఫీలయ్యారు. బిజినెస్ విషయంలో, రిలీజ్ విషయంలో చాలా బాధ్యత తీసుకున్నారు.... అని జీవిత తెలిపారు.

  హ్యూమానిటీ కొందరిలోనే ఉంటుంది

  హ్యూమానిటీ కొందరిలోనే ఉంటుంది

  ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో నా వెనకే ఉండి సపోర్టు చేస్తూ ఈ రోజు ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రవీణ్‌కి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో చాలా ఇంటలిజెంట్ పీపుల్ ఉంటారు, బ్రిలియంట్ పీపుల్ ఉంటారు. హ్యూమానిటీ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ప్రవీణ్ దగ్గర చాలా ఉంది.... అని జీవిత తెలిపారు.

  రాజశేఖర్‌తో తీయడానికి ఏముంటుంది? అనుకునేవారు

  రాజశేఖర్‌తో తీయడానికి ఏముంటుంది? అనుకునేవారు

  ఈ సినిమాపై ముందు ఎవరికీ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ప్రవీణ్ సత్తారు ఒక మంచి డైరెక్టర్, ఆయన సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. గుంటూరు టాకీస్ తీశారు... రాజశేఖర్‌తో ఏం తీస్తారు? తీయడానికి ఏముంటుంది? అనుకునే వారు.... అని జీవిత అన్నారు.

  బాలకృష్ణ, రానా, కాజల్, తాప్సీ, లక్ష్మికి థాంక్స్

  బాలకృష్ణ, రానా, కాజల్, తాప్సీ, లక్ష్మికి థాంక్స్

  ఈ సినిమాను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయమై సెట్స్ లో ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. టీజర్ లాంచ్ రానా, తాప్సీ, కాజల్, మంచు లక్ష్మి విడుదల చేశారు. ఒక ఫోన్ కాల్ చేయగానే వెంటనే ఒప్పుకుని ఆన్ లైన్లో విడుదల చేశారు. కాజల్, తాప్సీతో మాకు పెద్దగా పరిచయం కూడా లేదు. అయినా మా కోసం చేశారు. వారికి థాంక్స్. బాలకృష్ణగారిని ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నేను, శివానీ వెళ్లి అడిగితే మా మాట కాదనకుండా వచ్చారు. ముహూర్తం కూడా ఆయనే పెట్టి రిలీజ్ చేశారు..... అంతా ఎంతో సపోర్టు చేశారు అని అని జీవిత చెప్పుకొచ్చారు.

  ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరూ లేరా? అనుకున్న సమయంలో

  ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరూ లేరా? అనుకున్న సమయంలో

  ఈ ప్రపంచంలో ఎవరికీ ఎవరూ లేరా? మనకు మనమేనా? అనుకునేటపుడు ఇంత మంది మనకోసం ఉన్నారు అనే గట్టి నమ్మకాన్ని కల్పించిన వీళ్లందరికీ నా మనసారా థాంక్స్. సినిమా విడుదలైన తర్వాత కూడా అందరూ కాల్ చేసి మీకు ఈ సక్సెస్ వచ్చినందుకు చెప్పడం ఆనందంగా ఉంది. చిరంజీవిగారు, రాజమౌళిగారు, మహేష్ బాబుగారు, నమ్రతగారు... చాలా మంది డైరెక్టర్లు అందరూ మెచ్చుకున్నారు. ప్రజలంతా మనసారా మమ్మల్ని దీవించారు. మనసారా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు వారందరికీ థాంక్స్ అని జీవిత చెప్పుకొచ్చారు.

  English summary
  Jeevitha Speech At PSV Garuda Vega Movie Success Meet dragged the attention of all. We knew that PSV Garuda Vega movie has been getting the huge response from the audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X