twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి నియంత..నమ్మొద్దు

    By Staff
    |

    Rajasekhar
    చిరంజీవిని నమ్మొద్దు,సినీ పరిశ్రమలో చాలామంది నటుల్ని పైకి రానివ్వకుండా అణగతొక్కేసాడు.నియంతలా వ్యవహించాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేస్తానంటున్నాడు అంటూ ప్రజారాజ్యం అధినేత పై మరో సినీ నటుడు రాజశేఖర్ తీవ్ర విమర్శలు చేసారు. విజయవాడలోని స్థానిక కాంగ్రెస్‌ నాయకుని ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో ఆదివారం రాత్రి జరిగిన ముగ్గులపోటీ బహుమతి ప్రదాన కార్యక్రమానికి రాజశేఖర్‌, జీవిత ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల గురించి మొదట సరదాగా మాట్లాడిన రాజశేఖర్‌, ఆ తర్వాత తన ప్రసంగాన్ని చిరంజీవిపై మళ్ళించారు.

    రాజకీయ లబ్ధికోసమే చిరంజీవి మదర్‌ థెరిస్సా, జ్యోతిరావుపూలే, అంబేద్కర్‌ ఫొటోలు పెట్టుకుని సామాజిక న్యాయం అంటున్నారని నిజానికి చిరంజీవికి సామాజిక న్యాయం తెలియదని విమర్శించారు. బ్లడ్‌ బ్యాంకుతో పక్కా వ్యాపారం జరుగుతోందని, అన్నికోట్లు సంపాదించినా ఏనాడూ పేదవాడికి సాయం చేయని చిరంజీవి ఇప్పుడు ప్రజలకు ఎంతో చేస్తానని చెబుతున్నాడు. ముప్ఫై ఏళ్ళుగా ఆయన సినీ జీవితంలో సామాజిక న్యాయం కళ్ళకు కనబడలేదా, చెవులకు వినపడలేదా అని ప్రశ్నించారు. దయచేసి చిరంజీవి మాటలు నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు.

    చిరంజీవి తన మనుషులను పెట్టి తరిమితరిమి కొట్టించిన సందర్భంలో అభిమానులే తనకు అండగా నిలిచారని, అభిమానుల అండ ఉన్నంతకాలం తాను ఎవరికీ భయపడను అని అన్నారు. పేదలకు అండగానిలిచే పార్టీ ఒక్క కాంగ్రెస్‌ మాత్రమేనని పేర్కొన్నారు. అనంతరం జీవిత మాట్లాడుతూ, మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. తనకు విజయవాడ అంటే ఎంతో ఇష్టమని, చిన్నతనంలో ఎక్కువగా సంక్రాంతికి సత్యనారాయణపురం వచ్చేవారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, మల్లాది విష్ణు, వంగవీటి శంతన్‌కుమార్‌, కునుకు రాజశేఖర్‌, సామంతపూడి నరసరాజు, వీరమాచినేని లలిత తదితరులు పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X