Don't Miss!
- Sports
Ranji Trophy: 42 ఏళ్ల తర్వాత ముంబైపై ఢిల్లీ విజయం!
- News
ఏపీలో తారాస్ధాయికి బండి శ్రీనివాస్ వర్సెస్ కేఆర్ సూర్యనారాయణ పోరు.. !
- Lifestyle
రాత్రి కలలో చనిపోయిన అమ్మమ్మలు, తాతయ్యలు కనిపిస్తున్నారా? దానర్థం ఏంటంటే..
- Finance
IT News: టెక్కీలకు తలకెక్కింది దిగిపోయిందా !! ఇన్నాళ్లు కాదన్నారు.. ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చారు..
- Automobiles
సాధారణ ప్రజలనే కాదు కంపెనీ చైర్మన్ మనసు కూడా దోచేసిన Hero Vida.. స్కూటర్ డెలివరీ ఫొటోస్
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
కూతుళ్ల కోసం ఆస్తులు అమ్మాం, టెన్షన్ పడ్డాం.. అది మాత్రం ఎక్కడా కొనలేం: జీవిత రాజశేఖర్
సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు రాజశేఖర్-జీవిత దంపతులు. యాంగ్రీ హీరోగా రాజశేఖర్ అత్యధికంగా పాపులారిటీ సాధిస్తే.. నటిగా, దర్శకురాలిగా జీవిత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వాళ్ల నట వారసులుగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. దొరసాని సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం పంచతంత్రం. హాస్య బ్రహ్మా బ్రహ్మానందం నటించిన ఈ పంచతంత్రం మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

వేదవ్యాస్ గా బ్రహ్మానందం..
దొరసాని సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరసన జత కట్టింది శివాత్మిక రాజశేఖర్. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల పంచతంత్రం సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది శివాత్మిక రాజశేఖర్. డిసెంబర్ 9న విడుదలైన ఈ సినిమాకు హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. కథకుడు వేద వ్యాస్ గా బ్రహ్మనందం అలరించారు.

టెన్షన్ వచ్చేసింది..
పంచతంత్రం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి శివాత్మిక తల్లి జీవిత రాజశేఖర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె ఎమోషనల్ గా తమ కూతుళ్లకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చారు. "చిన్నప్పటి నుంచి మా ఇద్దరు అమ్మాయిలు సినిమా వాతావరణంలోనే పెరిగారు. ఆ ప్రభావంతోనే పెద్దయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి వస్తామని ఓ రోజు చెప్పారు. అలా చెప్పగానే నాకు, రాజశేఖర్ కు మాములు టెన్షన్ రాలేదు.

విధిపై ఆధారపడుతుంది..
ఎందుకంటే సినిమా రంగంలో రాణించాలంటే అంత సులభం కాదు. సక్సెస్ రావొచ్చు. రాకపోవచ్చు. దేనికి బాధపడకూడదని చెప్పాం. ఎందుకంటే సక్సెస్ ను మార్కెట్ లో కొనలేం కదా. సినిమాల్లోకి రాకముందు, చిన్నప్పటి నుంచి వాళ్లు ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి మరి కొనిచ్చాం. కానీ సినిమాలు అంత ఈజీ కాదు. మంచి పాత్రలు దొరకడం, ఫేమ్ రావడం, రాకపోవడం అనేది విధిపై ఆధారపడి ఉంటుంది.

ఇష్టాన్ని గౌరవించి..
ఫేమ్ రావడాన్ని డబ్బుతో ఎక్కడా కొనలేం. అందుకే మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం. కానీ వాళ్ల ఇష్టాన్ని గౌరవించి సపోర్ట్ చేస్తున్నాం" అని ఎమోషనల్ గా తెలిపారు జీవిత రాజశేఖర్. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. పంచతంత్రంలో డైరెక్టర్ చాలా నాచురల్ గా కథను చెప్పే ప్రయత్నం చేశారు"

గట్టి నమ్మకంతో వెళితే..
"ఇందులో అన్ని కథల్లో మన ప్రతి ఒకరి జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలు, కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలను చాలా చక్కగా చూపించారు. కష్టాల్లో ముందుకెళ్లే దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనం గట్టి నమ్మకంతో ముందుకెళ్తే ఏదో ఒక రోజు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. అదే విషయాన్ని పంచతంత్రం సినిమాలో చూపించారు"

ఏం చెప్పాలనుకున్నారో..
"సినిమా చూస్తే డెరెక్టర్ హర్ష చిన్న వయసులోనే జీవితాన్ని చాలా స్టడీ చేసి తెరకెక్కించినట్లు అనిపించింది. తను ఏం చెప్పాలనుకున్నారో.. దాన్ని అంతే చక్కగా స్క్రీనన్ పై ఆవిష్కరించారు. నేటి యువతలో చాలా మంది ప్రేమ, పెళ్లి, మానవ సంబంధాల గురించి అర్థం కాకుండా బాధ పడుతున్నారు. అలాంటి అంశాలను పంచతంత్రంలో చూపించారు. కుటుంబమంతా కలిసి సంతోషంగా చూసే సినిమా ఇది" అని జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు.