»   » పడకగదికి ఒకసారి వెళ్తే మోసం.. పదేళ్లు మోసపోరు.. గాజులు వేసుకోలేదు.. శ్రీరెడ్డి, సంధ్యపై జీవిత గరం

పడకగదికి ఒకసారి వెళ్తే మోసం.. పదేళ్లు మోసపోరు.. గాజులు వేసుకోలేదు.. శ్రీరెడ్డి, సంధ్యపై జీవిత గరం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jeevitha Rajasekhar Clarifies On Pow Sandhya Words

తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త, పీవోడబ్ల్యూ సంధ్య, మహా న్యూస్ ఛానెల్‌పై జీవిత రాజశేఖర్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా కథనాలను, ఆరోపణలను ప్రసారం చేస్తారని ఆమె నిలదీసింది. సంధ్య వ్యాఖ్యలను మహా న్యూస్ ప్రసారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమపై చేసిన నిరాధార ఆరోపణల గురించి స్పందిస్తూ.. జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జీవిత రాజశేఖర్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

 పరువు నష్టం దావా వేస్తా

పరువు నష్టం దావా వేస్తా

నాపై, మా కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసిన ఛానెల్‌పై కేసు పెడుతా, మహిళా నేత సంధ్యపై పరువు నష్టం దావా వేస్తా. మహిళా సంఘాల నేతల ఆరోపణలు అవాస్తవం. నాలుగేళ్ల క్రితం నేను ఓ అమ్మాయి ఫోన్ చేసినట్టు చెబుతున్న మహిళ నేత సంధ్య అప్పుడే ఎందుకు మాపై ఫిర్యాదు చేయలేదు.

అన్నిరంగాల్లోనూ తప్పులు

అన్నిరంగాల్లోనూ తప్పులు

ప్రతీ రంగంలోనూ తప్పొప్పులు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో తప్పులు జరగడం లేదని చెప్పడం లేదు. అమ్మాయిలు, మహిళలపై దారుణాలు జరుగకుండా ఎన్నో చట్టాలు చేస్తున్నారు. అయినా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.

పవన్ ఫ్యాన్స్ ధీటుగా జవాబు

పవన్ ఫ్యాన్స్ ధీటుగా జవాబు

సంధ్య మాదిరిగా వందల మంది మాట్లాడుతున్నారు.. వారిని ఎదురించి ప్రశ్నించే వారు ఎవరు లేరా అని నేను ప్రశ్నిస్తున్నాను. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఫ్యాన్స్ ధీటుగా సమాధానం చెప్పారు.

 గాజులు తొడుక్కొనేలేం

గాజులు తొడుక్కొనేలేం

జీవిత రాజశేఖర్ గురించి మాట్లాడితే మాట్లాడేవారు ఎవరు లేరనుకుంటున్నారేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గాజులు తొడుక్కొని ఎవరు లేరు. ఈ విషయాన్ని సంధ్య గారు తెలుసుకోవాలి. మీరు ఏంటో, మీ చరిత్ర ఏంటో తెలుసు. మీపై చీప్‌గా ఆరోపణలు చేయను. నా గురించి ఏం తెలుసని మాపై ఆరోపణలు చేయాలి.

సమాధానం చెప్పేవరకు ఊరుకోం

సమాధానం చెప్పేవరకు ఊరుకోం

మాపై చేసిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలి. ఆధారాలు చూపాలి. సంధ్య వ్యాఖ్యలను ప్రసారం చేసిన సోకాల్డ్ మహా న్యూస్ ఛానెల్ కూడా సమాధానం చెప్పాలి. అంతవరకు ఊరుకునే ప్రసక్తే ఉండదు.

శ్రీరెడ్డిపై జీవిత ఫైర్

శ్రీరెడ్డిపై జీవిత ఫైర్

శ్రీరెడ్డికి ఏమి అన్యాయం జరిగింది. తనకు ఎలాంటి సపోర్ట్ కావాలో నాకు అర్థం కావడం లేదు. ఒక హీరోయిన్‌గా ఛాన్స్ రావాలంటే చాలా అంశాలు హెల్ప్ అవుతాయి. శ్రీరెడ్డికి అవకాశాలు ఇవ్వాలనేది నిర్మాతల ఛాయిస్. తను పెట్టే పెట్టుబడికి ఎవరిని ఎంచుకోవాలనేది నిర్మాతలు ఆలోచిస్తారు. పాత్రను బట్టి, కొందరి ప్రతిభను ఏ హీరోయిన్‌కైనా అవకాశాలు వస్తాయి అన్నారు.

ఇండస్ట్రీ దారుణంగా

ఇండస్ట్రీ దారుణంగా

శ్రీరెడ్డి, సంధ్య చేసిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో నీ పిల్లలను ఎలా సినీరంగంలోకి పంపిస్తున్నారని అందరూ అడుగుతున్నారు అని జీవిత వెల్లడించింది.

ఒకసారి వెళితే తప్పు

ఒకసారి వెళితే తప్పు

వేషాల కోసం పడకగదికి ఒకసారి వెళ్లితే మోసం. రెండోసారి వెళితే మోసం. అదీ పది సంవత్సరాలు ఎవరూ మోసపోరు. మోసానికి గురైతే వెంటనే గ్రహిస్తారు. వాళ్లు 10 ఏళ్లు తెలిసే మోసపోయారా? క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తమకు ఇష్టమై వెళ్తారు. కొందరు బలవంతంగా వెళ్తారు. ఒకవేళ బలవంతం చేస్తే అది తప్పు.

 ఖండిస్తే ఆరోపణలా?

ఖండిస్తే ఆరోపణలా?

క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడితే నాపైనే అసత్య ఆరోపణలు చేస్తారా? ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు అందరి వద్ద పడుకొని వచ్చారని చెప్పడం ఖండిస్తే తప్పా? అలా మాట్లాడినందుకు నా భర్త వద్దకు అమ్మాయిలను పంపిస్తానని ఆరోపణలు చేయడం, అదే విషయాన్ని ఓ పెద్ద ఛానెల్ ప్రసారం చేయడం తప్పు అని జీవిత రాజశేఖర్ అన్నారు.

English summary
Jeevitha Rajasekhar responded on PoW Sandhya and Maha News Channel. They condemn the Sandhya allegations made on Them. Jeevitha Rajasekhar said that.. allegations made on us are baseless. We will take it seriously. This absolutely conspiracy against the fame and popularity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X