twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇకపై అన్నీ బోగస్ : నాని (ఆడియో లాంచ్ ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వాసన్ విజువల్ వెంచర్స్, మల్టీడైమెన్షన్స్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో నాని, అమలాపాల్, రాగిణి ద్వివేదిలు నాయకా నాయికలుగా నటించిన చిత్రం 'జెండాపై కపిరాజు'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. తెలుగులో నాని కథానాయకుడు కాగా తమిళంలో జయం రవి కథానాయకుడు. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈచిత్రం ఆడియో శనివారం సాయంత్రం శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరిగింది.

    ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ....'ఈ సినిమా నా జీవితంలో మరిచిపోలేని సినిమా. సముద్రఖని నా లుక్ గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా చేసినందుకే చాలా ఆనందంగా ఉంది. ఇకపై ఎలాంటి ఏం వచ్చినా అంతా బోగస్ గానే భావిస్తాను. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారికి, ఇరమై ముప్పై బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నవారికి దక్కే పాత్ర నాకు ఇంత త్వరగా దక్కడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా రవికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ చిత్రానికి రవి మంచి హైప్ ఇచ్చాడు. తెలుగులో ఈ సినిమా నా పెర్ ఫార్మెన్స్ కు 100 రోజులు ఆడితే తమిళంలో రవి పెర్ ఫార్మెన్స్ కు 175 డేస్ ఆడుతుంది. అంత బాగా చేశాడు. ఈ సినిమా నా లైఫ్ లో నేనెప్పటికీ మరచిపోలేను. జెండాపై కపిరాజు 100 డేస్ అయ్యేలోపల పైసా విడుదలవుతుంది' అన్నారు.

    సముద్రఖని మాట్లాడుతూ

    సముద్రఖని మాట్లాడుతూ


    చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ....తమ్ముడు నానికి దేవుడు అండగా వున్నాడు. నాని ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు. జెండాపై కపిరాజు అనేది విజయ సంకేతంగా పెట్టాం అన్నారు.

    జయం రవి మాట్లాడుతూ

    జయం రవి మాట్లాడుతూ


    నేను ఇప్పుడు తమిళ హీరోని అయినా నా ప్రస్థానం మొదలైందిక్కడే. నేను ఎడిటర్ మోహన్ గారి అబ్బాయిని. బావ బావమరిది చిత్రంలో చిన్నప్పటి సుమన్ పాత్ర నేనే చేశాను. అదే నా మొదటి చిత్రం. ఆ తరువాత నాన్నగారు తీసిన అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. ఈ సినిమా తమిళంలో నేను చేశాను. నాని నన్ను చాలా అభిమానంగా బాబాయ్ అని పిలుస్తాడు. నాకంటే నాని బాగా చేశాడు. నేనో ప్రొడ్యూసర్ కొడుకుగా హీరో అవటానికి వున్న పెయిన్ నాకు తెలియదు. కాని నాని అవన్నీ దాటుకొని హీరో అయ్యాడు. నాని ఫేస్ సినిమాకోసమే పుట్టిన ఫేస్ అన్నారు.

    ఈ కార్యక్రమానికి...

    ఈ కార్యక్రమానికి...


    ఈ కార్యక్రమానికి రజత్ పార్థసారథి శ్రీనివాసన్, శివరామన్ లు నిర్మాతలు. ఈ కార్యక్రమానికి వి.వి.వినాయక్, గోపీచంద్ మలినేని, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లరి నరేష్, నిఖిల్, వరుణ్ సందేశ్, సుధీర్ బాబు, శర్వానంద్, శివబాలాజి దంపతులు, వెన్నెల కిషోర్, తమిళ కథానాయకుడు జయం రవి, నాని, నాయిక రాగిణి ద్వివేదిలు హాజరయ్యారు.

    సినిమా కాన్సెప్టు

    సినిమా కాన్సెప్టు


    ‘ప్రతి వ్యక్తి తనను తాను సంస్కరించుకుంటే, దేశాన్ని సంస్కరించినట్లే‘ అనే సందేశాన్ని అంతర్లీనంగా మిళితం చేస్తూ వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో శివబాలాజీ, వెన్నెల కిషోర్, ధనరాజ్, ఆహుతి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్


    ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి. ప్రకాష్‌కుమార్, కెమొరా: సుకుమార్, ఫైట్స్: శివ, ఎడిటర్: ఫాజల్, నిర్మాతలు: కె.యన్. శ్రీనివాసన్ - కె.యన్. శివరామ్, కథ -స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: సముద్ర ఖని.

    English summary
    Janda Pai Kapiraju Movie Audio Launch held at Hyderabad. Nani, Ragini Dwivedi, Samuthirakani, Jayam Ravi, Allari Naresh graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X