»   » ఆ ప్లాప్ ఎఫెక్ట్: నాని ‘జెండాపై కపిరాజు’లో మార్పులు

ఆ ప్లాప్ ఎఫెక్ట్: నాని ‘జెండాపై కపిరాజు’లో మార్పులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని ద్విపాత్రాభినయం చేస్తూ అమలపాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'జెండాపై కపిరాజు'. ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ వెర్షన్(జయం రవి హీరో) ఇటీవల అక్కడ విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు వెర్షన్లో పలు మార్పులు, చేర్పులు చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో నెల రోజులపైనే పడుతుందని అంటున్నారు. అంటే ఏప్రిల్ నెలాఖరున ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

'Jenda Pai Kapiraju’ release delayed

ఈ చిత్రంలో నాని పాత్ర విషయానికొస్తే....తండ్రిగానూ, కొడుకు గానూ నాని కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు.

ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్‌ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

English summary
Nani, Amala Paul starrer ‘Jenda Pai Kapiraju’ seems to be moving towards a release after getting delayed due to various reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu