»   » సల్మాన్ ఖాన్ ప్రశ్న.. శ్రీదేవి, బోనికపూర్ గురించి జాన్వీ సమాధానం, సల్లూ భాయ్ మైండ్ బ్లాక్!

సల్మాన్ ఖాన్ ప్రశ్న.. శ్రీదేవి, బోనికపూర్ గురించి జాన్వీ సమాధానం, సల్లూ భాయ్ మైండ్ బ్లాక్!

Subscribe to Filmibeat Telugu
Salman Khan Shocked by Sridevi's Daughter

హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో శ్రీదేవి బోనికపూర్ ని వివాహం చేసుకున్నారు. బోనికపూర్, శ్రీదేవి పై ప్రేమతో ఆ వివాహం చేసుకోలేదని అప్పట్లో విమర్శలతో కూడిన గుసగుసలు వినిపించాయి. బోనికపూర్ దృష్టి శ్రీదేవి ఆస్తిపైనే అని విమర్శించినా వారు లేకపోలేదు. అలాంటి వాళ్ళందరి నోళ్లు మూయించేలా శ్రీదేవి తుదిశ్వాస వరకు బోనికపూర్ తో 22 ఏళ్ల పటు అన్యోన్య దాపత్యం కొనసాగించారు. శ్రీదేవి, బోణి కపూర్ కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయా అనే ప్రశ్నని ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ సంధించారు. అక్కడున్నవారంతా అవుననే సమాధానం ఇచ్చారు. కానీ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ ఇచ్చిన సమాధానం మాత్రం సల్లూ భాయ్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

1996 లో వివాహం

1996 లో వివాహం

అప్పటికే బోనికపూర్ నిర్మాణంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతోంది. ఆ పరిచయంతో దగ్గరైన బోనికపూర్, శ్రీదేవి 1996 లో పెళ్లి పీటలు ఎక్కారు.

బోనిపై విమర్శలు

బోనిపై విమర్శలు

బోనికపూర్ శ్రీదేవిని ప్రేమతో వివాహం చేసుకోలేదని, శ్రీదేవి స్టార్ గా సంపాదించిన ఆస్తిపైనే బోనికపూర్ దృష్టి అని బాలీవుడ్ నుంచే అప్పట్లో విమర్శలు వినిపించాయి.

విమర్శకుల దిమ్మతిరిగేలా

విమర్శకుల దిమ్మతిరిగేలా

విమర్శకుల దిమ్మతిరిగేలా శ్రీదేవి, బోనికపూర్ దంపతులు 22ఏళ్ల పాటు అన్యోన్య దాంపత్యం కొనసాగించారు. శ్రీదేవి తుది శ్వాసవరకూ బోనికపూర్ తోనే ఉన్నారు. ఎక్కడకు కలసి వెళ్లినా ఇద్దరూ జంటగా వెళ్ళవలసిందే. సినిమా ఫంక్షన్స్, పార్టీలకు బోని, శ్రీదేవి కలిసే వెళ్లేవారు.

వాంటెడ్ సినిమా ప్రమోషన్

వాంటెడ్ సినిమా ప్రమోషన్

2009 లో విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం వాంటెడ్ ని బోనికపూర్ నిర్మించారు. ఆ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అప్పటికి సల్మాన్ ఖాన్ ఓ టివి చానల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వాంటెడ్ చిత్ర బృందం మొత్తం సల్లూ భాయ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న దస్ కా దం అనే షోకు హాజరయ్యారు.

శ్రీదేవి పిల్లలు కూడా

శ్రీదేవి పిల్లలు కూడా

ఈ షోకు చిత్ర దర్శకుడు ప్రభుదేవా, హీరోయిన్ అయేషా టాకియా, బోనికపూర్, శ్రీదేవి జంటతో పాటు వారి పిల్లలు జాన్వీ, ఖుషి కూడా హాజరయ్యారు.

సరదా సరదాగా

సరదా సరదాగా

ఆ షో ఆధ్యంతం సరదాగా సాగింది. శ్రీదేవి జ్ఞాపకాలని నెమరువేసుకుంటున్న నెటిజన్లు ఆ షోకు సంబందించిన వీడియో క్లిప్పింగ్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సల్లూ భాయ్ అల్లరి చేష్టలు

సల్లూ భాయ్ అల్లరి చేష్టలు


ఈ షోలో సల్మాన్ ఖాన్ తన చిలిపి ప్రశ్నలు, అల్లరి చేష్టలతో అక్కడ ఉన్నవారందరిని హుషారెత్తించాడు.

నేనే ప్రపోజ్ చేశా

నేనే ప్రపోజ్ చేశా


మీ పేమ ఎలా మొదలైంది అని సల్లూ భాయ్ బోనికపూర్, శ్రీదేవి కి ప్రశ్న సంధించాడు. మొదట నేనే ప్రపోజ్ చేసానని, శ్రీదేవి వెంటనే అంగీకరించిందని బోని తెలిపారు. కానీ తన పేమని తెలియజేయడానికి మాత్రం తాను చాలా సమయం తీసుకున్నానని బోనికపూర్ అన్నారు.

శ్రీదేవి ప్రేమతో

శ్రీదేవి ప్రేమతో

అప్పటివరకు తక్కువ బరువు ఉన్న తాను వివాహం పూర్తయ్యాక శ్రీదేవి ప్రేమతో 20 కేజీలు బరువు పెరిగానని బోని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.

సల్మాన్ ఖాన్ ప్రశ్న

సల్మాన్ ఖాన్ ప్రశ్న

ఆ తరువాతి ప్రశ్నగా సల్లూభాయ్ అందరికి తెలిసిన విషయాన్నే ప్రశ్నగా సంధించాడు. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడతాయి. నిజమేనా అని సల్మాన్ ప్రశ్నించాడు.

అందరి సమాధానం ఒకేలా

అందరి సమాధానం ఒకేలా

దీనికి శ్రీదేవి బోనికపూర్ జంట, ప్రభుదేవా మరియు అయేషా టాకియా అవుననే సమాధానం ఇచ్చారు. స్వర్గంలో వివాహాలు నిర్ణయించబడతాయనే వాదనని వారంతా అంగీకరించారు.

జాన్వీ సమాధానంతో సల్లూభాయ్ మైండ్ బ్లాక్

జాన్వీ సమాధానంతో సల్లూభాయ్ మైండ్ బ్లాక్

వాంటెడ్ సినిమా సమయంలో జాన్వీ, ఖుషి చిన్నపిల్లలుగా ఉన్నారు. ఏ షోకి వారుకూడా హాజరు కావడం విశేషం. సల్మాన్ ఖాన్ వారి వంక తిరిగి దీనిగురించి మీరేమనుకుంటున్నారు డార్లింగ్స్ అని ప్రశ్నించాడు. ఖుషి నాకు తెలియదు అని చెప్పింది. కానీ జాన్వీ మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించింది. పెళ్లిళ్ల గురించి నాకు తెలియదు. కానీ అమ్మానాన్నలు మాత్రం స్వర్గంలోని నిర్ణయించబడుతారు అని సమాధానం ఇచ్చింది. దీనితో అక్కడ ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది. జాన్వీ ఆన్సర్ కు సల్లూ భాయ్ కూడా ఆశ్చర్యపోయారు.

 ఇప్పుడు చూడలేకపోతున్నాం

ఇప్పుడు చూడలేకపోతున్నాం

తల్లిదండ్రులపై అంతటి ప్రేమ పెంచుకున్న శ్రీదేవి కుమార్తెలని ఇప్పుడు చూడలేకపోతున్నాం అని ప్రముఖులు చెబుతున్నారు. తల్లి శాశ్వతంగా దూరం కావడంతో వారు భరించలేని వేదనని అనుభవిస్తున్నారు.

English summary
Jhanvi Kapoor mind blowing answer to Salman Khan in a tv show. Khanvi kapoor participated in Wanted promotion
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu