»   » రాఘవేంద్రరావు తన అనుభవాన్ని నాకు...లక్ష్మీ ప్రసన్న

రాఘవేంద్రరావు తన అనుభవాన్ని నాకు...లక్ష్మీ ప్రసన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

"రాఘవేంద్రరావు అంకుల్‌ తన వంద సినిమాల అనుభవాన్ని నాకు ఈ ఒక్క సినిమాకే నేర్పించారు. మా నాన్నగారు నాకు తగినంత గైడెన్స్‌ ఇచ్చారు. మనోజ్‌ యాక్టింగ్‌ చూసి వీడు సామాన్యుడు కాదు అని రాఘవేంద్రరావుగారు అనేవారు. తాప్సీలాంటి మంచి ఆర్టిస్ట్‌ను పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన కుమారుడు ప్రకాష్‌ అన్నయ్య డైరెక్షన్‌లో ఒక సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాను' అని లక్ష్మీ ప్రసన్న చెప్పుకొచ్చింది. 'ఝుమ్మంది నాదం' ఆడియో సక్సెస్ అయిన సందర్భంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇట్లా స్పందించారు. ఈ సమావేశంలో రాఘవేంద్రరావు, తాప్సీ, మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అశోక్‌ కుమార్‌ రాజు, మనోజ్ పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu