జియా సూసైడ్లో కొత్తకోణం : కడుపు చేసిన ప్రియుడు
తాజాగా షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జియా ఖాన్ తల్లి రబియా ఓ పత్రికతో మాట్లాడుతూ....'సూరజ్‌తో రిలేషన్ షిప్ కారణంగా ఆమె అబార్షన్ చేయించుకుంది. జియా ఖాన్ స్టైలిస్ట్ మానెకా, జియా మరణించిన మూడు రోజుల తర్వాత నాకు ఈ విషయం వెల్లడించారు' అని తెలిపారు.
సూరజ్ కారణంగానే జియా ఖాన్ సూసైడ్ చేసుకుందనే విషయాన్ని ఆమె తల్లి రబియా బలంగా నమ్ముతోంది. 'ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జియా సూజర్‌ను కలిసింది. సూరజ్.. జియాఖాన్ ముఖంపై కొట్టినట్లు నేను అనుమానిస్తున్నాను. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి ఇన్వెస్టిగేట్ చేయమన్నాను' అని రబియా బాధపడుతూ వెల్లడించింది.
జియాఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతూ...'సూరజ్ వల్ల జియా గర్భవతైనట్లు మానెకా మాకు వెల్లడించారు. ముంబైలోని ఆసుపత్రిలోనే అబార్షన్ జరిగింది. ఆ తర్వాత ఆమె చాలా నీరసంగా కనిపించింది. తినడం కూడా మానేసింది. ఆమె ఆత్మహత్యకు సూరజే కారణం. అతను ఆమెను హరాస్ చేసాడనటానికి ఆధారాలున్నాయి' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












