»   » జియాఖాన్ పోస్టుమార్టం రిపోర్టులో తేలిన నిజం

జియాఖాన్ పోస్టుమార్టం రిపోర్టులో తేలిన నిజం

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : బాలీవుడ్ నటి జియాఖాన్ మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసారు. వైద్యలు వెల్లడించిన నివేదిక ప్రకారం ఆమె ఉరి వేసుకోవడం వల్లనే చనిపోయిందని, ఇది ఆత్మ హత్యే అని ధృవీకరణ అయింది. రాత్రి 11 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో ఆమె ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు. దీంతో జియా ఖాన్ మరణంపై నెలకొన్న అనుమానాలకు తెర పడినట్లయింది.

25 సంవత్సరాల వయసుగల జియా ఖాన్ సోమవారం అర్ధరాత్రి ముంబై జుహులోని సంగీత్ సాగర్ అపార్టు మెంటులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ అవకాశాలు లేక పోవడంతో పాటు, ప్రేమ వ్యవహారం విఫలం అవ్వడం కూడా ఆమెను కృంగ దీసినట్లు, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె తన స్నేహితుడు సూరజ్ పంచోలితో మాట్లాడింది. సూరజ్‌తో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకుందా? అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ముంబై పోలీసులు సూరజ్‌ను పిలిపించి విచారణ జరిపారు. సూరజ్ తండ్రి, బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలిని కూడా పోలీసులు విచారించినట్లు సమాచారం. మరోసారి వారిని విచారణకు పిలిచే అవకాశం ఉంది.

నిశ్శబ్ద్‌, హౌస్‌ఫుల్‌ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్‌ సరసన గజని చిత్రంలోనూ నటించారు. 2010లో వచ్చిన హౌస్‌ఫుల్ సినిమా తర్వాత ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. ఫిబ్రవరి 20, 1988లో న్యూయార్కులో జన్మించిన లండన్లో పెరిగిన జియా ఖాన్ 18 ఏళ్ల వయసులోనే నిశ్శబ్ధ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తల్లి రబియా 80ల్లో బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఎన్నో ఆశలతో బాలీవుడ్లో అడుగు పెట్టిన జియా ఖాన్‌ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదనే చెప్పాలి. దీనికి తోడు పర్సనల్ ప్రాబ్లన్స్, అవకాశాలు దొరకక పోవడం లాంటి సమస్యలు ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పినట్లు బాలీవుడ్ టాక్. 25 ఏళ్ల వయసులోనే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం పలువురిని కలిచి వేసింది.

English summary
The preliminary post-mortem report of Jiah Khan confirms that the actress died due to hanging. The 25-year-old had hung herself on Monday night at her flat in Sagar Sangeet Building in the posh Juhu area of northwest Mumbai around midnight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu