»   »  ఏ వయస్సైనా ఓకె

ఏ వయస్సైనా ఓకె

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jiah khan
పదహారు యేళ్ళ నుంచి అరవై యేళ్ళ వరకూ ఏ వయస్సులో ఉన్న హీరో అయినా నాకు ఓ.కె...పాత్ర నచ్చితే చేస్తాను అంటోంది జియాఖాన్. వర్మ క్యాంపు నుంచి వచ్చిన నిశ్శబ్ద్ తో పరిచయమైంది. అందులో అరవై యేళ్ళ అమితాబ్ ప్రేమలో పడే టీనేజ్ అమ్మాయిగా శృంగారం ఒలకపోసి అభిమానుల కళ్ళల్లో నిలిచిపోయింది. ఆ సినిమాలో ఆమె వేసుకున్న హాట్ హాట్ డ్రస్సులు ఆ తరువాత ముంబాయిలో పాపులర్ అయ్యాయి. అలాగే గజని రీమేక్ లో అమీర్ ఖాన్ ప్రక్కన సెకెండ్ హీరోయిన్ గా నయనతార చేసిన పాత్రను పోషిస్తోంది.

తాజాగా ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో షాహిద్ కపూర్ ప్రక్కన నటిస్తోంది. ఇలా మూడు తరాల నటులతో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.ఇది అందరికీ అందే అదృష్టం కాదు. అలా అరుదైన అవకాశాల్ని అందిపుచ్చుకున్న ఆమెని దీనిపై మీ ఫీలింగ్ అంటే ...నవ్వుతూ నా అదృష్టం ఇది.ఏ తరం హీరోకైనా నేను సూటవుతాను అని పరిశ్రమ గుర్తించటం హ్యాపీగా ఉందంటోంది. వివిధ దశలలో విభిన్న హావ భావాలు ఎలా పలకించాలో నేర్చుకోవచ్చు అని గడుసుగా చెప్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X