»   » జియా‌ఖాన్ మరణానికి బాయ్‌ఫ్రెండే కారణమా?

జియా‌ఖాన్ మరణానికి బాయ్‌ఫ్రెండే కారణమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ అంతా ఒక్కసారి షాక్‌కు గురైంది. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అంతా అనుకుంటున్న తరుణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

జియా ఖాన్ హఠాన్మరణానికి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా కారణం అయి ఉండవచ్చునేమో అనే ఊహాగానాలు బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. నటుడు కమల్ ఆర్ ఖాన్ చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఆత్మహత్యకు ముందు తన బాయ్ ఫ్రెండుతో మాట్లాడిందని తెలుస్తోంది. 'జియా ఖాన్ రాత్రి 11 గంటల వరకు అతని బాయ్ ఫ్రెండుతో మాట్లాడింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. నేను ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి మాటలు రావడంలేదు. జియా ఖాన్ ఎంతో ఎమోషనల్ గర్ల్' అని వెల్లడించారు.

ఆమె బాయ్ ఫ్రెండ్ వ్యవహారం ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉంటూ వచ్చింది. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఆమె ఎప్పటి నుండో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ వస్తోందట. సోమవారం రాత్రి ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సాగిందని పోలీసులు వెల్లడించినట్లు సదరు పత్రిక వెల్లడించింది.

వీరి మధ్య కేవలం సంభాషణలు మాత్రమే కాదు, ఎస్ఎంఎస్ వ్యవహారాలు కూడా నడిచాయట. వేరే అమ్మాయితో అతని ఫ్రెండ్షిప్ గురించి జియా ఖాన్ అడిగిందని, అలాంటిదేమీ లేదని అతను బదులు ఇచ్చినట్ల తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్, జియా ఖాన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

తన తల్లిదండ్రులు ఆదిత్య పంచోలి, జరీనా వాహెబ్‌లతో సూరజ్ పంచోలి. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం జియా ఖాన్, సూరజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది.

పోలీసులు సదరు పత్రికతో చెప్పిన వివరాల ప్రకారం.... జియా ఖాన్, సూరజ్ మధ్య సోమవారం రాత్రి టెలిపోన్ సంభాషన్ సాగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు సదరు పత్రికకు చెప్పిన వివరాల ప్రకారం....జియా ఖాన్, సూరజ్ మధ్య సోమవారం రాత్రి ఎస్ఎంఎస్ చాటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. జియా ఖాన్ సూరజ్‌ను ఇతర అమ్మాయితో ఉన్న సంబంధం గురించి అడిగినట్లు తెలుస్తోంది. మా మధ్య ఏమీ లేదు నీ అనుమానం నిజం కాదని సూరజ్ క్లారిఫై చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు జియాఖాన్ ఆత్మహత్యకు కెరీర్ నిరాశాజనకంగా ఉండటం, ఆర్థిక ఇబ్బందులే కారణం అని అంతా అనుకున్నారు. సూరజ్ పేరు బయటకు రావడంతో ఈ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసినట్లయింది.

English summary
So far, we have been hearing that actress Jiah Khan committed suicide as she was very depressed over her sinking Bollywood career. But now, there seems a new angle to this mysterious death case of Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu