జియా ఖాన్ తప్పుడు వ్యక్తితో... : మౌనం వీడిన తల్లి
ఆమె తల్లి రబియా ఖాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...'నా కూతురు పని ఒత్తిడి ఎదుర్కొంది అనే వార్తల్లో నిజం లేదు. ఆమె బాగానే ఉంది. ఎంతో సిన్సియర్' అని చెప్పుకొచ్చింది. జియా ఖాన్ పొట్టలో ఆల్కహాల్, ఒత్తిడి తట్టుకునే మాత్రలు గుర్తించినట్లు వస్తున్న వార్తలను కూడా ఆమె కుటుంబ సభ్యులు తోసి పుచ్చారు. శవ పరీక్ష నివేదికలో అలాంటిదేమీ లేదని, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అంటూ మీడియాకు సూచించారు.
'ఆమె ప్రేమించిన వ్యక్తి నుంచి మోసం, అబద్దాలు ఎదురయి ఉంటాయి. మాకేమీ రివేంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశ్యం లేదు...కానీ ఆమె తప్పుడు వ్యక్తి ప్రేమలో పడిందనేది నిజం' అని జియా తల్లి రబియా మీడియాతో అన్నారు. ఆదిత్య పంచోలి ఫ్యామిలీ జియా అంత్యక్రియలకు రావడాన్ని మేము అంగీకరించలేదని, జియా సోదరి కరిష్మా వెల్లడించారు.
జియా బాయ్ ఫ్రెండ్ సూరజ్ మాత్రమే ఆ రోజు నైట్ ఏమి జరిగింది, ఆమెను ఆత్మహత్య వైపు ప్రోత్సహించిన కారణాలు ఏమిటి? అనే నిజాలు చెప్పగలని ఆమె కుటుంబం ఆశిస్తోంది. పోలీసులు జియా ఫోన్లో కేవలం మూడు మెసేజ్ లు మాత్రమే గుర్తించినట్లు చెబుతున్నారు. కానీ ఆ రోజు రాత్రి సూరజ్ నుంచి ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయని ఆమె సోదరి కరిష్మా అంటోంది.


Click it and Unblock the Notifications












