లవ్ లెటరే, సూసైడ్ నోట్‌లా చూడొద్దు : సూరజ్ తల్లి
సూరజ్‌తో ప్రేమాయణం కారణంగానే జియా ఆత్మహత్య చేసుకుందనే విషయం ఆ సూసైడ్ నోట్లో స్పష్టమవుతోంది. అయితే సూరజ్ పంచోలి తల్లి జరీనా వాహెబ్ వాదన మాత్రం వేరేలా ఉంది. జియా రాసింది లవ్ లెటర్ మాత్రమే, దాన్ని సూసైడ్ నెట్ అని అంటే ఎలా అని వాదిస్తోంది.
'అది లవ్ లెటర్ మాత్రమే. ఒక రోజు ముందే దాన్ని ఆమె రాసింది. ఆరు పేజీలతో కూడిన అది లవ్ లెటర్ మాత్రమే. సూసైడ్ నోట్ ఎంత మాత్రము కాదు' అని జరీనా వాహెబ్ వాదిస్తోంది. అయితే జరీనా వాహెబ్ వాదనను ఎవరూ నమ్మడం లేదు. ఒక తల్లిగా తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని, ఆమె చేస్తున్న వాదనలో పస లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక్కడ ఒకటి మాత్రమ నిజం. లవ్ లెటర్ అంటే లవ్‌లీగా...తన ప్రియుడిని పొగుడూ రాస్తారు, నీతో హాగా జీవించాలని ఉందని రాస్తారు. కానీ జియా తను రాసిన లెటర్లో బాయ్ ఫ్రెండ్ సూరజ్‌ను మోసగాడిగా అభివర్ణించింది. అతని వల్ల తను ఎంతగా హర్టయ్యానో, ఎంత బాధకు గురయ్యానో వెల్లడించింది. సూరజ్ తనను రేప్ చేసినట్లు, అబార్షన్ చేయించినట్లు కూడా వెల్లడించింది. మరి ఇలా రాసిన దాన్ని లవ్ లెటర్ అంటారా?


Click it and Unblock the Notifications












