»   » ప్రేమ కాదు... జీవితమే ముఖ్యం : షారుక్

ప్రేమ కాదు... జీవితమే ముఖ్యం : షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ సూసైడ్‌పై షారుక్ తనదైన రీతిలో స్పందించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని గౌరవించాలి, ప్రేమ కంటే జీవితం ఎంతో ముఖ్యమైంది అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ముంబైలో తన తాజా సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా షారుక్ ఈ వ్యాఖ్యలు చేసారు.

ఈ సందర్భంగా షారుక్ మీడియాతో మాట్లాడూ..'ప్రేమపై అందరికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రేమ అనేది యూనివర్సల్. లవర్ బాయ్ గా రకరకాల పాత్రలు చేసాను. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం ప్రేమ కంటే జీవితానికే ఎక్కువ గౌరవం ఇవ్వాలి' అని వ్యాఖ్యానించారు షారుక్.

జీవిత-ప్రేమ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ...'ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నిసార్లు కష్టతరమైన పరిస్థితులు వస్తాయి. అంతమాత్రాన జీవితం వ్యర్థం అనుకోవద్దు. వాటి నుంచి బయటపడి జీవించడానికి ప్రయత్నించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. ప్రేమకు బౌండరీలు, లిమిట్స్ లేవు. అంత మాత్రాన ప్రేమ జీవితం కంటే ముఖ్యం అని మాత్రం అనుకోవద్దు' అని వెల్లడించారు.

నటి జియా ఖాన్ గత వారం ముంబైలోని జుహు ప్రాంతంలో తన అపార్టుమెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండుతో ప్రేమ విఫలం కావడం, అతని వల్ల ఎదుర్కొన్న ఆత్మక్షోభ కారణంగా మనస్థాపానికి గురైన జియా బలవన్మరణానికి పాల్పడింది.

English summary
Mumbai: Superstar Shahrukh Khan, who launched the trailer of his most anticipated film Chennai Express on Thursday, said in relation to Bollywood actress Jiah Khan's suicide that it is important to respect life more than love.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu