»   » జియా డెత్ : నా కొడుకును విలన్‌ను చేస్తే ఎలా?

జియా డెత్ : నా కొడుకును విలన్‌ను చేస్తే ఎలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ ఇండస్ట్రీ నటి జియా ఖాన్‌ను ఇటీవల కోల్పోయిన సంగతి తెలిసిందే. జియా ఖాన్ ఆత్మహత్యకు ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి కారకుడయ్యాడంటూ అంతులేని ఆరోపణలు వినిపిస్తునే ఉన్నాయి. జియా ఖాన్ ఆత్మహత్య చేసుకునే ముందు చాలా సేపు సూరజ్‌తో మాట్లాడటంతో.....ఆమె చావుకు కారణం అతనే అంటూ అందరి వేళ్లు అతని వైపే చూపుతున్నాయి.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం...సూరజ్ పంచోలితో ఉన్న ఎఫైర్ కారణంగా ఆమె ఎంతో మనోవేదనకు గురైందని, ఆ పరిణామాలే ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పాయని అంటున్నారు. దీంతో జియా కేసు విషయంలో అందరూ సూరజ్ పంచోలిని విలన్‌గా చూస్తున్నారు. అయితే సూరజ్ తండ్రి, బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి మాత్రం తన కొడుకు అండగా నిలిచాడు.

ఆదిత్య పంచోలి ఓ పత్రికతో మాట్లాడుతూ... ఇక్కడ సూరజ్ చేసిన తప్పేంటి? కారణం లేకుండా అతన్ని విలన్‌గా ఎందుకు చూపెడుతున్నారు? అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసారు. 'ప్రేమ అనేది ఓ బ్యూటిఫుల్ ఎమోషన్. కొన్ని సందర్భాల్లో కలతలు వస్తాయి. అలాంటప్పుడు ఒక్కరినే బ్లేమ్ చేయడం సరికాదు' అని చెప్పుకొచ్చారు.

'మీడియాలో వస్తున్న ఆరోపణల కారణంగా సూరజ్ చాలా హర్టయ్యాడు. భయ పడుతున్నాడు. జియా ఖాన్ మరణంలో ఒకరిని మాత్రమే వేలెత్తి చూపడం సరికాదు. ఆమె మరణానికి వేరే కారణం ఇంకేమైనా అయి ఉండొచ్చు. నా కుమారుడి మాత్రమే విలన్‌గా చూడటం మానండి' అని పేర్కొన్నాడు.

English summary
Khan, and there's been endless speculations if her boyfriend Suraj Pancholi was the cause of her death. According to several media reports, Suraj was the last person, with whom Jiah had spoken for the last time, before committing suicide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu