Just In
- 8 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 9 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జియా ఖాన్ సూసైడ్ లెటర్...ఇదే (ఫోటోలు)
ముంబై : గత సోమవారం ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటి జియా ఖాన్, తన బాయ్ ఫ్రెండ్ సూరజ్‌తో సాగించిన ప్రేమ వ్యవహారంలో సమస్యల కారణంగానే ఆ చర్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. జియా ఖాన్ తల్లి రబియా అమిన్ జియా రాసిన ఆరు పేజీల సూసైడ్ లేఖను బయట పెట్టింది. అందులో ఆమె సూరజ్ వల్ల ఎంత టార్చర్ ఎదుర్కొందో స్పష్టమవుతోంది.
జియా ఖాన్ తన ప్రియుడు సూరజ్ ను ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్‌లో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించింది. సూరజ్‌ను ప్రేమించడం వల్ల ఎన్నో కోల్పోయానని, అతను ప్రతిరోజూ టార్చర్ పెట్టే వాడని పేర్కొంది. నీతో కలిసి జీవించడంపై ఎన్నో కలలు కన్నాను. కానీ నువ్వు వాటిని కల్లలు చేసావు. నిన్ను ప్రేమించి మోస పోయాను అంటూ జియా ఖాన్ పేర్కొంది.
'నేను నీకోసం ఎన్నో చేసాను. మన కోసం పని చేసాను. నువ్వు మాత్రం నాతోడుగా లేవు. నా ఫ్యూచర్ నాశనం అయింది. సంతోషం నాకు దూరం అయింది. కానీ నువ్వు ఎప్పుడూ బాగుండాలనే కోరుకున్నాను. నీ బాగు కోసం డబ్బు కూడా పెట్టుబడిగా పెట్టడానికి రెడీ అయ్యాను. కానీ నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు. నా నన్ను కొట్టావు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు. ఎంతో హర్టయ్యాను. నీ కోసం వెయిట్ చేసాను. కానీ నువ్వు మారలేదు' అంటూ పేర్కొంది.
జియా రాసిన సూసైడ్ నోట్ ఫోటోలతో పాటు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

జియా రాసిన ఆరు పేజీల లేఖను పోలీసులకు అందజేసారు. ఇందులో జియా రాసిన వివరాలు ఎంతో మందిని షాక్‌కు గురి చేసారు.

పోలీసులు జరుపుతున్న విచారణపై జియా ఫ్యామిలీ అసంతృప్తిగా ఉంది. వారు విచారణ పర్ ఫెక్టుగా చేయడం లేదని వాదిస్తున్నారు.

జియా ఖాన్ మృతికి సూరజ్‌తో ప్రేమ వ్యవహారమే కారణమని, అతని వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని జియా తల్లి అంటోంది.

తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ కారణంగా జియా ఖాన్ గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు తెలియుకండా ముంబైలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంది.

జియా గర్భం దాల్చిన విషయం ఆమె మరణం తర్వాత బయట పడింది. జియా స్టైలిస్ట్ ఈ విషయాన్ని జియా తల్లికి వెల్లడించింది.

తాజాగా జియా ఖాన్ సూసైడ్ నోట్ బయట పడటంతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.