»   »  ఏ తెలుగు సినిమా ఆడిషన్ కి జియాఖాన్ వచ్చింది?

ఏ తెలుగు సినిమా ఆడిషన్ కి జియాఖాన్ వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jiah Khan
హైదరాబాద్: ఆదివారం హైదరాబాద్ వచ్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్న జియా ఖాన్...ఇక్కడ ఏ చిత్రం ఆడిషన్ కి వచ్చింది అనే అంశంపై అంతటా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఓ తెలుగు స్టార్ హీరో చిత్రంలో ఐటం సాంగ్ చేయటానికి పిలిపించినట్లు సమాచారం. అయితే ఇంతకుముందు కూడా ఆమెను తెలుగులో ఐటం సాంగ్ కి అనుకున్నారు. చివరి నిముషాల్లో డ్రాప్ అయ్యారు.

ఇంతకీ ఆ డ్రాప్ అయిన ఐటం సాంగ్... వెంకటేష్ రీసెంట్ చిత్రం షాడో. అందులో అంత్యాక్షరి సాంగ్ కు ఆమెను ఎంచుకున్నారు. కానీ కుదరలేదు. అయితే ఆమె తప్పుకోవటానికి కారణం..ఆ చిత్రంలో విలన్ గా చేసిన ఆదిత్య పంచోలి అని వినపడింది. ఆదిత్య పంచోలి కుమారుడుతో ఆమె ప్రేమ వ్యవహారం ఉండటంతో ఈ వార్త వచ్చింది.

ఈ నేపధ్యంలో మీడియావారు షాడో దర్శకుడు మెహర్ రమేష్ ని ఈ విషయమై అడగటం జరిగింది. మెహర్ రమేష్ మాట్లాడుతూ.. " ఆదిత్య,జియా ఒకరినొకరు తెలుసనే విషయం మాకు తెలియదు. సూసైడ్ జరిగిన తర్వాత వచ్చిన రిపోర్టులను బట్టి ఆమె ఆదిత్య కుమారుడుని డేటింగ్ చేస్తుందని తెలుసుకున్నాం ," అన్నారు.

అలాగే..." అలాగే మేం షాడోలో అంత్యాక్షరి ఐటం సాంగ్ ఆమెను అనుకున్నాం...అంతా ఫైనలైజ్ అయ్యింది. కానీ వేరే సినిమా షూటింగ్ లో జియాకు కాలు దెబ్బ తగిలిందని చెప్పటంతో డ్రాప్ అయ్యింది. మరో ప్రక్క ఐటం సాంగ్ ల మీద మీడియాలో చర్చ కూడా జరుగుతూంటే ప్రత్యేకంగా ఐటం గర్ల్ ని పెట్టడం ఎందుకని, తాప్సీ చేతే ఆ పాట చేయించాం ," అని రమేష్ వివరించారు.

English summary

 On the weekend before she killed herself, Jiah Khan was in Hyderabad for an audition. According to sources, she was offered an item song in a big-budget movie, featuring a Telugu superstar. But this was not the first time the actor was approached for an item number. Interestingly, Jiah was offered an item song earlier this year in the film Shadow. However, at the nth hour, the actor's appearance was cancelled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu