»   » గోపీచంద్ ‘జిల్’ సినిమా టాక్ ఎలా ఉంది?

గోపీచంద్ ‘జిల్’ సినిమా టాక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గోపీచంద్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిల్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. గోపీచంద్ గత చిత్రం లౌక్యం హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ రోజు విడుదలైన ‘జిల్' చిత్రం ప్రేక్షకులను సంతృప్తి పరచలేక పోయిందనే టాక్ వినిపిస్తోంది.

సినిమాలో గోపీచంద్ పెర్ఫార్మెన్స్, రాశిఖన్నా గ్లామర్, సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నప్పటికీ...... రోటీన్ స్టోరీ కావడం, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేక పోవడం, డైరెక్షన్ లోపాలు కొట్టొచ్చినట్లు కనబడటం, ఎంటర్టెన్మెంట్స్ ఆశించిన స్థాయిలో లేక పోవడం, వీక్ గా సాగిన క్లైమాక్స్ వెరసి....సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో ఫెయిలైందని అంటున్నారు. మరికొద్ది సేపట్లో ‘జిల్' పూర్తి స్థాయి విశ్లేషణ మా క్రిటిక్స్ అందించబోతున్నారు. వెయిట్ అండ్ సీ...


'jil' movie public talk

ఈ చిత్రాన్ని ప్రభాస్ చిన్ననాటి స్నేహితులైన వంశీ, ప్రమోద్ ‘యువి క్రియేషన్స్' బేనర్లో నిర్మించారు. నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.


సాంకేతిక వర్గం పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్ డైరెక్టర్ - అనిల్ అరసు, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి - శక్తి శరవణన్, మ్యూజిక్ - జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్.

English summary
Jil movie is a stylish entertainer movie directed by Radha Krishna Kumar and Produced by Pramod Uppalapati, Vamsi Krishna Reddy under UV Creations banner while Ghibran scored music for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu