»   » ‘జిల్’ శాటిలైట్ రైట్స్ ఎక్కువగానే వచ్చాయండోయ్!

‘జిల్’ శాటిలైట్ రైట్స్ ఎక్కువగానే వచ్చాయండోయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల విడుదలైన గోపిచంద్ ‘జిల్' చిత్రం ప్రేక్షకుల నుండి జస్ట్ ఓకే అనే టాక్ తెచ్చుకుంది. ఇంతకాలం సినిమాకు పోటీ ఏమీ లేక పోవడంతో కలెక్షన్లు కూడా ఫర్వాలేదనిపించాయి. అయితే శాటిలైట్ రైట్స్ మాత్రం ఎక్కువగానే సంపాదించింది. ఓ ప్రముఖ చానల్ రూ.4.75 కోట్లకి శాటిలైట్ రైట్స్‌ని సొంతం చేసుకున్నారట. యువీ క్రియేషన్స్ పతాకంలో నిర్మించిన ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రాశీ ఖన్నా నటించింది.

చిత్రం కథేమిటంటే... జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...జై తన ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా రంగనాధ్ (బ్రహ్మాజి) అనే వ్యక్తిని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు. అతనికీ విలన్ వెనక పడటాని కీ లింక్ ఏమిటీ అంటే... ఆ రంగనాథ్ మరెవరో కాదు..ఆ డాన్ దగ్గర నుంచి వెయ్యి కోట్లు డబ్బు కొట్టేసి పారిపోయినవాడు. అయితే మన హీరో రక్షించినప్పుడు ...రంగనాథ్ చివరి క్షణాల్లో మాట్లాడతాడు. దాంతో మన హీరోకు ఆ డబ్బు వివరాలు చెప్పాడని విలన్ కు డౌట్ వస్తుంది. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. ఆ విషయాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Jil satellite rights 4.75 cr

చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటించారు.


ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్.

English summary
According to the latest report, Gopichand’s latest action entertainer Jil satellite rights have been sold at 4.75 crores to a leading television channel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu