»   » రొమాన్స్, యాక్షన్: ‘జిల్’ థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)

రొమాన్స్, యాక్షన్: ‘జిల్’ థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గోపీచంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా సక్సెస్ ఫుల్‌ నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన హ్య‌ట్రిక్ చిత్రం 'జిల్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు విడుదల చేసారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న దిల్ రాజుతో పాటు హీరో గోపీచంద్, హీరోయిన్ రాశిఖన్నా దర్శక, నిర్మాతలు పాల్గొన్నారు.


ట్రైలర్ ని లాంఛ్ చేసిన అనంతరం దిల్ రాజు ఆయన మాట్లాడుతూ - ''ప్రభాస్ ప్రోత్సహంతో వంశీ, ప్రమోద్ యు.వి.క్రియేషన్స్ స్థాపించి 'మిర్చి'తో విజయాన్ని అందుకుని, ఆ వెంటనే 'రన్ రాజా రన్' చిత్రాన్ని నిర్మించారు. శర్వానంద్ తో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించడంతో హ్యాట్రిక్ కొట్టాలనే టార్గెట్ తో గోపీచంద్ తో 'జిల్' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా రాధాకృష్ణ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. మా సంస్థ నుంచి చాలామంది కొత్త దర్శకులు బయటికి వచ్చారు. వంశీ, ప్రమోద్ కూడా కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కథను నమ్మి సినిమాలు చేసే గోపీచంద్ 'జిల్' కథ ఎంతో బాగా నచ్చి అంగీకరించాడు. 'లౌక్యం'తో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరయ్యాడు గోపీ. 'జిల్'లో చాలా యూత్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. సో... ఈ చిత్రంతో గోపీచంద్ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతాడనే నమ్మకం ఉంది. ఈ నెల 27న విడుదలవుతున్న ఈ చిత్రంతో వంశీ, ప్రమోద్ హ్యాట్రిక్ అందుకోవడం ఖాయం'' అన్నారు.


డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ - ''మంచి కథ దొరికితే ఈ నిర్మాతలు సినిమా చేయడానికి ఏ మాత్రం వెనకాడటంలేదు. జిబ్రాన్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. గోపీచంద్, రాశిఖన్నా అద్భుతంగా నటించారు. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది'' అని తెలిపారు.


Jil Theatrical Trailer

హీరో గోపీచంద్ మాట్లాడుతూ - ''ప్రభాస్ తో నాకు ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. తన ద్వారానే నాకు వంశీ, ప్రమోద్ పరిచయం అయ్యారు. నేను ఎలాంటి కథతో సినిమా చేయాలనుకున్నానో, అలాంటి కథతో నా దగ్గరకు వచ్చారు వంశీ, ప్రమోద్. డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమా బాగా రావడానికి ఎంతో కష్టపడ్డాడు. డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నేను కూడా అవుట్ ఫుట్ పట్ల చాలా శాటిస్ ఫై అయ్యాను. రాశిఖన్నా చాలా అందంగా ఉంది. తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది. జిబ్రాన్ పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

English summary
Jil Telugu movie official Theatrical Trailer, starring Gopichand, Raashi Khanna, Kabir Duhan Singh, Chalapathi Rao, Posani Krishna Murali, Srinivas Avasarala, among others. Music by Ghibran, directed by Radha Krishna Kumar & produced by Vamsi, Pramod under the banner of UV Creations. Cinematography by Sakthi Saravanan.
Please Wait while comments are loading...