twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్‌తో పని జరగదు.. జోహార్ డైరెక్టర్‌కు షాకిచ్చిన నిర్మాత

    |

    టాలీవుడ్‌కు మరో ప్రతిభావంతుడైన డైరెక్టర్ రూపంలో తేజ మార్ని లభించాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆయన రూపొందించిన జోహార్ సినిమా సినీ విమర్శకులు, సగటు అభిమానులను ఆకట్టుకొంటున్నది. జోహార్ సినిమా కోసం పడిన కష్టం, సినిమా ఇండస్ట్రీకు వచ్చిన తొలినాళ్లలో అనుభవించిన బాధలు, జోహార్ సినిమా రిలీజ్‌కు కరోనా అడ్డుపడటం పడిన సమస్యలను వెల్లడించారు. తేజ మార్ని చెప్పిన విషయాలు మీ కోసం..

    ఆర్జీవి, విజయేంద్ర ప్రసాద్ వద్ద

    ఆర్జీవి, విజయేంద్ర ప్రసాద్ వద్ద

    సినిమా ఇండస్ట్రీలో కెరీర్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాత రాంగోపాల్ వర్మతో కలిసి పనిచేశాను. ముంబైలో ఆయన సినిమాకు పనిచేశాను. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ వద్ద స్క్రిప్ట్ రైటర్‌గా వర్క్ చేశాను. ఆ సమయంలో ఓ నిర్మాత సినిమా చేద్దామని అన్నారు. దాంతో ఆఫీస్ తీసి స్క్రిప్టు వర్క్ మొదలు పెట్టి ఫినిష్ చేశాం. ఆ తర్వాత ఆ నిర్మాత నాకు షాకివ్వడం కోలుకోలేకపోయాను అని తేజ మార్ని అన్నారు.

    హీరోయిన్లతో వర్కవుట్ కాదని

    హీరోయిన్లతో వర్కవుట్ కాదని

    నేను తయారు చేసిన కథ హీరోయిన్ ఓరియెంటెడ్ కథ కావడంతో స్టార్ హీరోయిన్‌కు చెప్పాలనుకొన్నాను. ఆయనకు కొంత మంది హీరోయిన్ల పేర్లు చెబితే.. వాళ్లతో వర్కవుట్ కాదు. వేరే హీరోయిన్లయితే పని సులుభం అవుతుంది. పెద్ద హీరోయిన్లు అందుకు ఒప్పుకోరని అన్నారు. అందుకు ఒప్పుకోకపోవడంతో నాకు ఆఫర్ ఇవ్వని చెప్పారు. దాంతో నాకు ఒక్కసారిగా మనసు విరిగిపోయింది. నీతో పనిచేయనని చెప్పి ఊరికి వెళ్లిపోయాను అని తేజా మార్ని పేర్కొన్నారు.

     నిర్మాత షాక్ నుంచి బయటపడి

    నిర్మాత షాక్ నుంచి బయటపడి

    నిర్మాత ఇచ్చిన షాక్ నుంచి బయటపడి నేనే సొంతంగా సినిమా తీయాలని అనుకొన్నాను. నా బడ్జెట్‌ అంచనా వేసుకొని కథ రాయడం మొదలుపెట్టాను. అలా పుట్టిన కథే జోహార్. ఆ నిర్మాతతో సినిమా చేయకపోవడం వల్లే జోహార్ లాంటి సినిమా చేశాను. ఈ సినిమాలో నేను కనిపిస్తాను. నాకు మంచి పేరు వచ్చిందనే అభిప్రాయాన్ని తేజా వ్యక్తం చేశారు.

    జోహార్ సినిమా చూసిన ఓ నిర్మాత

    జోహార్ సినిమా చూసిన ఓ నిర్మాత

    జోహార్ సినిమా పూర్తయిన తర్వాత ఫస్ట్ కాపీని నిర్మాత, డిస్టిబ్యూటర్ అభిషేక్ నామాకు చూపించాం. ఆయన సినిమా చూసిన తర్వాత కారెక్కి.. జోహార్ మూవీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి, విడుదల చేయడానికి నేను సిద్ధం. ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్దామని చెప్పారు. అంతలోనే కరోనావైరస్ ముప్పు వాటిల్లింది. ఇక ఈ ఏడాది థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో ఇంట్లో ఉండే ఆర్థిక ఒత్తిళ్లతో ఓటీటీ ద్వారా రిలీజ్ చేశాం అని చెప్పారు.

    Recommended Video

    'Aha' Team Makes Us Happy To Release Johar Movie In OTT Platform
    బన్నీ వాసు అడ్వాన్సుతో హ్యాపీ

    బన్నీ వాసు అడ్వాన్సుతో హ్యాపీ

    జోహార్ సినిమా చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు తమతో సినిమా చేయమని అడిగారు. చాలా మందితో సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ బన్నీ వాసు మాత్రం అడ్వాన్సు ఇచ్చారు. నా సొంత సినిమా తర్వాత నాకు లభించిన పారితోషికం అదే. నా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాననే ఫీలింగ్ కలిగింది.

    English summary
    Johaar movie getting good appreciation from all the corners from all the film section. Movie director Teja Marni work loudly appreciated by critics. In intial days of career, He gets shock from Producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X