»   » జాన్‌ అబ్రహం...'జాతి గర్వించతగ్గ వ్యక్తి'

జాన్‌ అబ్రహం...'జాతి గర్వించతగ్గ వ్యక్తి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహంకు 'జాతి గర్వించతగ్గ వ్యక్తి' (ప్రైడ్‌ ఆఫ్‌ ద నేషన్‌) పురస్కారం దక్కింది. 'మద్రాస్‌ కేఫ్‌' చిత్రంలో జాన్‌ అబ్రహం 'రా' ఏజెంట్‌ పాత్ర పోషించారు. పాత్రోచితంగా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావించారు. సున్నితమైన ఈ అంశాన్ని ధైర్యంగా ప్రస్తావించినందుకుగాను అబ్రహంకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్టు ఉగ్రవాద వ్యతిరేక సంస్థ అధ్యక్షుడు ఎంఎస్‌ బిట్టా తెలిపారు. ఈ చిత్రం కమర్షయల్ విజయం సాధించటమే కాకుండా విమర్శకుల ప్రశంసలూ పొందింది.

జాన్‌ మాట్లాడుతూ 'భారతదేశ చరిత్రలో ఇదో మైలురాయిలా నిలిచిపోయే చిత్రమవుతుంది. పొలిటికల్‌ అంశాలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చినప్పటికి ఇదో ట్రెండ్‌ సెట్టరయ్యే కథతో వస్తోంది. టెర్రరిజం కూడా వుంటుంది. దీన్ని ఇంటర్నేషనల్‌ అవార్డులకు కూడా పంపుతాం' అని సుజిత్‌ తెలిపారు.

ఈ సినిమా తమిళుల హక్కులను ప్రశ్నించే రీతిలో ఉందని, సినిమాని నిషేధించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని మార్పులు చేర్పులు చేసింత్తర్వాత గానీ సినిమా విడుదలకు కొన్ని వర్గాలు ఒప్పుకోలేదు. పట్టాళి మక్కల్ కచ్చి అధినేత ఎస్.రాందాస్ ఈ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయటమే కాదు.. శ్రీలంకలో తమిళులు చేస్తున్న పోరాటానికి వక్ర భాష్యం చెప్పే రీతిలో ఈ సినిమా తీశారని ఆరోపిస్తున్నారు. శ్రీలంకలో తమిళులు జరుపుతున్న పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదు కాబట్టి వాళ్లకు న్యాయం జరగటం లేదని, లంక తమిళులకు మద్దతును ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాదిస్తున్నారు కూడా.

ఇటువంటి తరుణంలో అర్థం పర్థంలేని సినిమా వల్ల లంక తమిళులకు చాలా అన్యాయం జరుగుతుందనీ, ఈ సంగతి మొత్తం తమిళ జాతి గుర్తించాలని కోరుతున్నారు. ఎల్‌టిటిఇని తక్కువచేసి చూపటం అంటే అందులో పని చేస్తున్న వారిని, తమిళుల్ని అవమానించడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇన్ని వివాదాల మధ్య విడుదలైన 'మద్రాస్ కేఫ్' 1990లో శాంతి పరిరక్షక దళం పేరిట భారత సైన్యాన్ని శ్రీలంకకు పంపినప్పుడు జరిగిన సంఘటనలనూ, ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన హోరాహోరీ యుద్ధానికి సంబంధించిన కథనం ఆధారంగా చిత్ర రచన జరిగింది.

మరో ప్రక్క 'మద్రాస్ కేఫ్' సినిమా కథ బూటకం అంటూ వైగో వివాదం మొదలెట్టారు. 'మద్రాస్ కేఫ్' సినిమాలో ఈలం పులుల గురించి తప్పుగా చూపించారని, ఆ సినిమా వాస్తవానికి విరుద్ధంగా వుందని ఎండీఎంకే నేత వైగో ధ్వజమెత్తారు. శుక్రవారం బన్రూట్టిలో జరిగిన ఎండీఎంకే కార్యకర్త వివాహానికి హాజరైన వైగో విలేఖరులతో మాట్లాడుతూ... తమిళ జాతి కోసం అశువుల బాసిన పులుల గురించి తప్పుగా చిత్రీకరించిన ఆ సినిమాను శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. బీజేపీ వంటి పార్టీలు కూడా ఆ సినిమాను తప్పు బడుతున్నాయని గుర్తు చేశారు. తమిళులను ఊచకోత కోసిన శ్రీలంక ప్రభుత్వం నిర్వహిస్తున్న కామన్వెల్త్ సదస్సుకు భారత్ హాజరుకాకూడదని వైగో డిమాండ్ చేశారు.

English summary
Bollywood actor John Abraham was conferred the ‘Pride of the Nation’ award for his attempt to raise the sensitive issue of former Prime Minister Rajiv Gandhi’s assassination through his role as a RAW agent in “Madras Cafe“.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu